Home > ఆరోగ్యం > వారంలోనే 5 కిలోల బరువు తగ్గాలంటే ఇలా చేయండి

వారంలోనే 5 కిలోల బరువు తగ్గాలంటే ఇలా చేయండి

వారంలోనే 5 కిలోల బరువు తగ్గాలంటే ఇలా చేయండి
X

చాలా మంది బరువు పెరిగిపోయామని బాధపడుతూ ఉంటారు. మరికొందరేమో బరువు తగ్గడానికి రకరకాల మందులు వాడి ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. ఇంకొందరు జిమ్‌కు వెళ్లి కుస్తీలు పడుతూ ఉంటారు. దానివల్ల బరువు కొంతమేర తగ్గినప్పటికీ సరైన ఆహార నియమాలు పాటించకపోతే శరీరంలో మరింత చెడు కొవ్వు పేరుకుపోతుంది. ఆ తర్వాత అనారోగ్యపాలు అయ్యే అవకాశం ఉంది. బరువు తగ్గడం అంటే శరీరంలో కొవ్వును కరిగించుకోవడమే కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. హెల్తీగా బరువు తగ్గాలంటే అది కూడా వారంలోనే 5 కిలోల బరువు తగ్గాలంటే ఇలా చేయండి.

బరువు తగ్గాలనుకునేవారు ఆహారాలను వీలైనంత తగ్గించేస్తూ ఉంటారు. దానివల్ల వారికి మరిన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాకాకుండా బరువు తగ్గాలనుకుంటే పోషకాలతో కూడిన ఆహారాన్ని తినాలి. ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు ఉండేలా చూసుకోండి. అవి కొద్దిగా తిన్నా మీ పొట్ట నిండినట్లు చేస్తాయి. ఫాస్ట్ ఫుడ్స్‌ను వీలైనంత వరకూ తగ్గించండి. ఆహారాన్ని కంట్రోల్‌లో ఉంచుకుంటే బరువు తగ్గడం మరింత సులభం. రోజులో ఒకసారి పళ్ల రసాలు తాగండి.

మీరు భోజనం చేయడానికి చిన్న బౌల్స్‌‌ను వాడండి. చిన్న బౌల్‌లో భోజనం తినడం వల్ల తక్కువ తిన్నప్పటికీ ఎక్కువగా తిన్నామనే ఫీలింగ్ వస్తుంది. ఆహారం తినేటప్పుడు ఇంకేం పనులు చేయకండి. పూర్తిగా ఆహారంపైనే శ్రద్దపెట్టండి. టీవీ ముందో, కంప్యూటర్ ముందో, పేపర్ చదువుతూనే భోజనం తినడం కచ్చితంగా మానుకోండి. కూరల్లో ఆయిల్ వాడటం తగ్గించేయండి. అలాగే క్రమం తప్పకుండా ఒక సమయంలో పది నిమిషాల నుంచి గంట వరకూ నడవండి. సైక్లింగ్ చేస్తే ఇంకా మంచిది. దానివల్ల కేలరీలు బాగా బర్న్ అవుతాయి.

బరువు తగ్గాలనుకునేవారు రోజుకు 8 గ్లాసుల నీళ్లు తాగడం ఎంతో మంచిది. నీళ్లతో పాటుగా కొబ్బరినీళ్లు, జీరా నీళ్లు, నిమ్మరసం, మిరియాలతో చేసిన కషాయం వంటివి తాగండి. సరిపడా నీళ్లు తాగుతూ ఉంటే ఆకలి అనిపించదు. అలాగని ఎక్కువగా నీరు తాగొద్దు. ఇకపోతే బరువు తగ్గాలనుకునేవారు ముఖ్యంగా చేయాల్సిన పని సరిపడా నిద్రపోవడం. మంచి నిద్ర మిమ్మల్ని ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. సరిగ్గా నిద్రపోకపోతే హార్మోన్లు దెబ్బతిని మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. కచ్చితంగా 7 నుంచి 9 గంటల పాటు నిద్రపోండి. ఇలా చేస్తే వారంలో 5 కిలోల వరకూ బరువు కచ్చితంగా తగ్గుతారు.

Updated : 2 Feb 2024 2:43 AM GMT
Tags:    
Next Story
Share it
Top