Home > ఆరోగ్యం > Health tip: షుగర్ పేషెంట్లు.. ఎంత అన్నం తినాలో తెలుసా!

Health tip: షుగర్ పేషెంట్లు.. ఎంత అన్నం తినాలో తెలుసా!

Health tip: షుగర్ పేషెంట్లు.. ఎంత అన్నం తినాలో తెలుసా!
X

ఈమధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా వస్తున్న జబ్బు డయాబెటిస్. ఈ వ్యాధి రాగానే ఓ.. కంగారు పడిపోయి ఇది తినకూడదు, అది తినకూడదంటూ కడుపు మాడ్చుకుంటారు. అంతేకాదు మీల్స్ లో చపాతి యాడ్ చేసుకుని, అన్నం తక్కువ చేస్తుంటారు. అయితే, ఎక్కువ చపాతి తిన్నా ప్రమాదమే అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. రెండు పూటలా అన్నం తింటూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు. అయితే దానికీ కొంత లిమిట్ ఉంది. ఎంతంటే..

అన్నంలో కార్బోహైడ్రేట్స్ శాతం అధికంగా ఉంటుంది. దానివల్ల శరీరంలో షుగర్ లెవల్స్ పెరుగతాయి. అందుకే డాక్టర్లు అన్నం తినడం తగ్గించాలి అంటారు. అలాగని పూర్తిగా మానేయమనలేదు కూడా. షుగర్ ఉన్న వ్యక్తులు పురుషులైతే రోజుకు 60 నుంచి 75 గ్రాములు, స్త్రీలైతే.. 45 నుంచి 60 గ్రాముల అన్నం తీసుకోవాలని చెప్తున్నారు. అంటే సగటున పూటకు అరకప్పు అన్నం తింటే సరిపోతుంది. దీంతో పాటు పాలు, పండ్లు కూడా తినొచ్చు. ఇలా మితంగా తినేవాళ్లు.. సాయంత్రం కూడా ఈ రకంగా అన్నం తినొచ్చని చెప్తున్నారు.

ముడి బియ్యం కూడా హెల్త్ కు మంచిది. అందులో పోషకాలు ఎక్కువ. రక్తంలో షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. షుగల్ ఉన్నవాళ్లు తినే ఏ ఆహారం అయినా శరీరానికి మేలు చేసేదిగా చూసుకోవాలి. అప్పుడే ఆరోగ్యకరమైన జీవితం గడపొచ్చు. ఎప్పుడూ పాలు, పండ్లు, మాంసం కాకుండా.. అప్పుడప్పుడు చిరుధాన్యాలు, గింజలు, దుంపలు తినడం మంచిది.

Updated : 8 Aug 2023 6:52 AM GMT
Tags:    
Next Story
Share it
Top