Home > ఆరోగ్యం > JN.1 Variant : కలవరపెడుతున్న కొత్త వేరియంట్..కరోనా వ్యాక్సిన్ పనిచేస్తుందా?

JN.1 Variant : కలవరపెడుతున్న కొత్త వేరియంట్..కరోనా వ్యాక్సిన్ పనిచేస్తుందా?

JN.1 Variant : కలవరపెడుతున్న కొత్త వేరియంట్..కరోనా వ్యాక్సిన్ పనిచేస్తుందా?
X

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికించింది. దాదాపు రెండేళ్ల పాటు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది ఈ మహమ్మారి. అయితే కరోనా కథ ముగిసింది కదా అని అంతా రిలాక్స్ అవుతున్న తరుణంలో తగ్గినట్లే తగ్గి.. మళ్ళీ కరోనా విజృంభించడం మొదలు పెట్టింది. అవును మీరు వింటుంది నిజమే చాప కింద నీరులా భారత దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ బారినపడిన వారి సంఖ్య 2669కి చేరుకుందని తెలుస్తోంది. అందులోనూ మరీ ముఖ్యంగా గత వారం రోజుల నుంచి డెయిలీ యాక్టివ్ పేషెంట్ల సంఖ్య అధికమవుతోంది. దీనంతటికి కొత్త సబ్-వేరియంట్ JN.1ప్రధాన కారణమని వైద్యులు భావిస్తున్నారు. రీసెంట్‎గా కేరళలో ఈ కొత్త వేరియంట్ బయటపడినప్పటి నుంచి జనాల్లో ఆందోళన పెరిగింది. ప్రభుత్వ నిపుణులు, మైక్రోబయాలజీ టీమ్ సభ్యులు, జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్న ల్యాబ్ ఈ వేరియంట్‌పై నిరంతరం పని చేస్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా JN. 1 వేరియంట్ వైవిధ్యంగా ఉందని వెల్లడించింది. అయితే ఈ వేరియంట్ వల్ల ప్రమాదం పొంచి ఉందా? ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వేరియంట్‌ల కారణంగా.. పరిస్థితి ఆందోళనకరంగా మారే అవకాశం ఉందా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

ప్రపంచవ్యాప్తంగా JN.1 వేరియంట్ కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సింగపూర్ , అమెరికా సహా భారత్‎లోనూ JN.1 వేరియంట్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. స్టార్టింగ్ స్టేజ్‎లో ఈ వైరస్ రోగులలో తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. కోవిడ్‌ వైరస్‌ తన రూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటోందని WHO తెలిపింది. ఈ క్రమంలో, JN.1 వేరియంట్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇది BA.2.86 సబ్ వేరియంట్. ఇదిలా ఉంటే భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు వ్యాక్సిన్ల గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్ కరోనా కొత్త సబ్-వేరియంట్ JN.1పై ప్రభావవంతంగా పనిచేస్తుందా అన్న ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. చాలా వరకు వేరియంట్ కేసులు ఫ్లూ లాగే ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిని సీరియస్ గా తీసుకోలేదు. WHO, CDC రెండూ కరోనా వైరస్ సబ్ వేరియంట్ JN.1ని నిరోధించడంలో ప్రస్తుత కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుందని నిర్ధారించాయి. JN.1 రూపాంతరం Omicron కి చెందిన ఉప-వేరియంట్ కాబట్టి.. ఇప్పటికే ఉన్న టీకా ఈ వేరియంట్ ప్రభావాన్ని తగ్గించగలదు అని పేర్కొంది. అంతే కాదు టీకాలు వేయడం ద్వారా ఆసుపత్రిలో మరణించే కేసులను తగ్గించవచ్చని చెప్పింది. అయితే కోవిడ్ వైరస్‌లో నిరంతర మార్పుల దృష్ట్యా యూనివర్సల్ వ్యాక్సిన్‌పై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలు అలాంటి వ్యాక్సిన్‌లను రూపొందించడంలో నిమగ్నమయ్యారని సమాచారం.

ఈ కొత్త సబ్ వేరియంట్ కోసం ప్రస్తుతం మరో డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకోవలసిన అవసరం ఉందా అన్నది మరో ప్రశ్న. అయితే ఇప్పటి వరకు వ్యక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఈ వైవిధ్యం ఉన్న రోగుల్లో లక్షణాలు ఎలా ఉన్నాయో పరిశీలించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ICMR ఎక్స్‏పర్ట్స్ మాత్రమే ఈ విషయంలో ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. JN.1 వేరియంట్ కేసులు మరిన్ని పెరిగితే వచ్చే సమస్యలను బట్టి టీకాపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈ క్రమంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా JN.1 వేరియంట్‌ బారిన పడిన రోగులు ప్రస్తుతం ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని తెలిపింది. తీవ్ర అస్వస్థతకు గురైన వారు మాత్రమే హాస్పిటల్‎లో చేరాలని సూచించింది. ఈ కోత్త సబ్ వేరియంట్ లక్షణాలు దగ్గు, జలుబు, తేలికపాటి జ్వరం మాత్రమే. ప్రపంచంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకా దీనికి ప్రభావవంతంగా పనిచేస్తుందని WHO చెప్పింది.




Updated : 22 Dec 2023 7:49 AM GMT
Tags:    
Next Story
Share it
Top