Health tips : అతిగా మాంసం తినేవారికి అలర్ట్..ఆ సమస్యలు తప్పవు
X
ఆదివారం అయితే చాలు ఇంట్లో చికెన్, మటన్ ఉండాల్సిందే. చాలా మంది ముక్కపడందే కడుపు నిండదనుకునేవాళ్లు ఉంటారు. అతిగా మాంసం తింటూ తమ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటూ ఉంటారు. వాస్తవానికి మాంసాహారం తినడం వల్ల శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి. అయితే అతిగా తినడం వల్లనే అనేక ఇబ్బందులు వస్తాయి. మాంసం పరిమితంగా తింటే శరీరం బావుంటుంది. కానీ అతిగా తింటే మాత్రం అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. మాంసాహారం వల్లే ఎక్కువ మంది క్యాన్సర్, గుండె జబ్బుల బారిన పడుతున్నారని పరిశోధనల్లో తేలింది.
మాంసాహారం అతిగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ఒకానొక సమయంలో గుండెపోటు ప్రమాదం కూడా వస్తుంది. అలాంటి పరిస్థితిలో మాంసం తినడం మానేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. గుండెజబ్బులకు దూరంగా ఉండాలంటే మాంసాన్ని తక్కువగా తీసుకోవడం ఉత్తమం. ఇకపోతే మాంసాన్ని తప్పుడు పద్దతిలో తీసుకుంటే మాత్రం విపరీతంగా బరువు పెరిగే అవకాశం ఉంది.
మాంసం మానేసిన వ్యక్తులు బరువు తగ్గుతారు. అలాగే ఆకు కూరలు, పండ్లు తీసుకుంటే శరీరానికి కావాల్సినంత పోషకాలు అందుతాయి. అంతేకాదు అధిక బరువు సమస్య కూడా ఉండదు. అధిక మాంసం తినడం వల్ల పేగుల పనితీరుపై చెడు ప్రభావం పడుతుంది. అందులోనూ ప్రాసెస్ చేసిన మాంసం చాలా ప్రమాదకరం. జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అలాగే మలబద్దక సమస్య కూడా వస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండలేరు. అందుకే మాంసాహారానికి కాస్త దూరంగా ఉండండి. పండ్లు, ఆకుకూరలు, గుడ్లు వంటివి తింటూ ఆరోగ్యంగా ఉండండని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.