Home > ఆరోగ్యం > MALABADDAKAM : కడుపు నొప్పే అని సైలెంట్‎గా ఉంటే...అంతే సంగతులు!!!

MALABADDAKAM : కడుపు నొప్పే అని సైలెంట్‎గా ఉంటే...అంతే సంగతులు!!!

MALABADDAKAM : కడుపు నొప్పే అని సైలెంట్‎గా ఉంటే...అంతే సంగతులు!!!
X

మలబద్దకం అనేది సమస్త రోగాలకు మొదటి మెట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలామంది పైకి చెప్పుకోలేరు కానీ, ఈ మధ్యకాలంలో ఎంతో మంది ఫేస్ చేస్తున్న హెల్త్ ఇష్యూస్‎లో ఇది కూడా ఒకటి. అయితే ఇక్కడి విచిత్రం ఏమిటంటే, ఒక సమస్యగా అసలు గుర్తించకపోవడం. మలబద్ధకం సమస్య గురించి సీరియస్‌గా ఆలోచించకపోతే మాత్రం మన బాడీలో అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్సులు ఉంటాయి. మలబద్ధకం సమస్య దీర్ఘకాలం వేధిస్తే కిడ్నీప్రాబ్లమ్స్‎, పైల్స్, తలనొప్పి, గ్యాస్, ఆకలి లేకపోవడం, బలహీనత, వికారం, మొటిమల సమస్యలు, నల్ల మచ్చలతో పాటు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయి. అయితే లైఫ్ స్టైల్‏లో మార్పులతో డైట్‌లో కొన్ని హెల్దీ ఫుడ్స్ చేర్చుకుంటే.. మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు.

మలబద్ధకం సమస్య వేధిస్తున్నట్లైతే కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. మలద్వారం కోసుకుపోవడం, రక్తస్రావం కావడం వంటి సమస్యలు ఏర్పడతాయి. మలబద్ధకం ఏర్పడటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకేచోట కదలకుండా కూర్చోవడం, మంచి ఆహారపు అలవాట్లు లేకపోవడం, జంక్‌ ఫుడ్ తీసుకోవడం, నీరు సరిగా తాగకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, బలహీనమైన జీవక్రియలు, రాత్రిళ్లు ఆలస్యంగా తినడం, పడుకునేవారిలో ఈ సమస్య వచ్చే ఛాన్స్ ఉంది. ఇదే సమస్య సుదీర్ఘకాలం కొనసాగితేనే అనేక రకాల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్య నివారణకు ఎన్నో సహజసిద్ధమైన ట్రీట్మెంట్స్, మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి.

బొప్పాయితో మలబద్ధకం దూరం :

ఈ సమస్యతో బాధపడేవారు మెంతులతో చక్కటి పరిష్కారం పొందవచ్చు. ప్రతి రోజు ఓ స్పూన్ మెంతులను నైట్ నానబెట్టి, ఉదయం తింటే చక్కలి ఫలితం ఉంటుంది. లేదంటే పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో చెంచాడు మెంతిపొడిని కలుపుకుని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదా బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత, లంచ్‎ చేసే ముందు, సాయంత్రం పూట వెజిటబుల్‌ జ్యూస్‌ తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. బచ్చలికూర, టొమాటో, బీట్‌రూట్, లెమెన్ జ్యూస్, అల్లం కలిపి జ్యూస్‌ను ప్రిపేర్ చేసుకుని తాగడం మంచిది. ఇక ఫ్రెష్ ఫ్రూట్స్ అందులోనూ ముఖ్యంగా బొప్పాయి పండు తినడం వల్ల ఈ సమస్య తీరుతుంది. ప్రతి రోజూ ఉదయం 11 గంటల సమయంలో భోజనానికి ముందు ఒక కప్పుడు బొప్పాయి ముక్కలను తినాలి. వీటితో పాటే జామపండు, దోసగింజలను తిన్నా మంచిదే. భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు మజ్జిగ, అర స్పూన్‌ అవిసెగింజలు తీసుకున్నా మలబద్ధకం సమస్య తగ్గుతుంది.

ఖాళీ కడుపుతో ఇది తాగాతే :

మలబద్ధకంతో బాధపడేవారు రోజూ ఉదయం సబ్జా గింజలను నానబెట్టిన నీటిని ఖాళీ కడుపుతో తీసుకోవాలి. అదే విధంగా ముందు రోజు నానబెట్టిన బాదం పప్పులతో పాటు , వాల్‌నట్స్, ఎండు ద్రాక్షలను తీసుకుంటే సమస్య తగ్గుముఖం పడుతుంది. అలాగే అంజీర్‌లో విటమిన్‌ బి6 ఎక్కువగా ఉంటుంది. ఇందులో కరిగే ఫైబర్‌ అధికం. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. మలబద్ధం సమస్యను నివారిస్తుంది. రాత్రిపూట నానబెట్టిన అంజీర పండ్లను ప్రతిరోజూ ఉదయం తింటే పేగు కదలికలను సులభతరం చేస్తుంది.

పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది :

ఓట్స్‌లో బీటా–గ్లూకాన్స్‌ లభిస్తాయి. ఇవి కరిగే ఫైబర్. అంతే ఓట్స్‌ మంచి బ్యాక్టీరియాను పేగులలో పెంచడంలో సహాయపడతాయి. అంతేకాదు పేగుల పనితీరును ప్రోత్సహించడంలో, మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తాయి. దీంతో మలబద్ధకం సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. నెయ్యికి ఉండే.. సహజమైన జిడ్డు తత్త్వం పేగుల కదలికల్లో స్పీడ్ పెంచుతుంది. ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో నెయ్యి కలుపుకోవడం వల్ల మలబద్ధకం నుంచి విముక్తి పొందచ్చు. జామపండ్లు, దోసకాయ, కాకరకాయ, చిక్కుళ్లు మలబద్ధకాన్ని నివారించడంలో ముందువరుసలో ఉంటాయి. కాబట్టి వీటిని ఆహారంలో భాగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.




Updated : 9 Dec 2023 12:20 PM IST
Tags:    
Next Story
Share it
Top