Hair Care : చలికాలంలో జుట్టు రాలుతోందా?? అయితే ఇలా తగ్గించుకోండి
X
జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్య. వాతావరణంలో మార్పులు లేదా శరీరంలోని అనేక సమస్యల వల్ల జుట్టు రాలుతూ ఉంటుంది. చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. గాలిలో తేమ పెరగడం వల్ల జుట్టు పొడిబారడంతో పాటు పెళుసుగా మారుతుంది. అయితే ఈ సీజన్ లో కొన్ని చిట్కాలు పాటిస్తే జుట్టు రాలడాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.
పుష్కలంగా నీరు త్రాగాలి:
చలికాలంలో చాలా మంది నీరు తాగడం మర్చిపోతుంటారు. దీంతో డీహైడ్రేషన్ కలిగి జుట్టును ప్రభావితం చేస్తుంది. కాబట్టి నీరు ఎక్కువగా తాగాలి. నీరు ఎక్కువగా తాగడం వల్ల స్కాల్ప్ ఆరోగ్యం మెరుగుపరుతుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయండి:
తలకు పట్టించే నూనెను డబుల్ బాయిలింగ్ పద్ధతిలో వేడి చేయాలి. జుట్టుకు బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇది వెంట్రుకల కుదుళ్లను బలపరుస్తుంది మరియు అవి రాలిపోకుండా మరియు విరిగిపోకుండా చేస్తుంది.
హెర్బల్ హెయిర్ మాస్క్:
జామకాయ, వేప , మందార వంటి ఆయుర్వేద మూలికలను ఉపయోగించి పోషకమైన హెయిర్ మాస్క్‌ను సిద్ధం చేయండి. వీటిని తలకు పట్టించడం వల్ల జుట్టుకు బలం చేకూరుతుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. పెరుగు లేదా కొబ్బరి నూనెలో పొడి మూలికలను కలపడం ద్వారా మీరు హెయిర్ మాస్క్‌ను తయారు చేసుకోవచ్చు.
సమతుల్య ఆహారం తీసుకోండి:
ఆరోగ్యకరమైన శరీరం, జుట్టు కోసం, సమతుల్య ఆహారం తీసుకోవాలి. మినరల్స్, విటమిన్లు, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది. మీ ఆహారంలో ఆకు కూరలు, పండ్లు, కూరగాయలు , గింజలు ఉండేలా చూసుకోండి. ఇది మీ శరీరం, జుట్టు ఆరోగ్యంగా ఉంచుతుంది.