సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టే అల్లం టీ
X
పొద్దున్న వేడి వేడి టీ గొంతులో పడందే చాలా మందికి రోజు మొదలుకాదు. గుక్కెడు టీ గొంతు దిగిందంటే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. అలాంటి టీకి అల్లం జోడిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముంది. వాటికి చెక్ పెట్టేందుకు అల్లం టీ అద్భుతంగా పనిచేస్తుంది.
వర్షాకాలంలో వాతావరణం ఒక్కసారిగా మారడంతో చాలా మందికి అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. సీజనల్ వ్యాధులకు అల్లం టీతో చెక్ పెట్టవచ్చు. జలుబు, ఒళ్లు నొప్పులు, జ్వరం తదితర సమస్యలకు జింజర్ టీ బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలన్నింటినీ అల్లం వెంటనే దూరం చేస్తుంది.
అల్లం టీలో ఉండే విటమిన్ సి, మెగ్నీషియం, మినరల్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
ప్రయాణాలలో కడుపులో తిప్పే వారికి, వాంతులు అయ్యే వారికి అల్లం టీ ఉపశమనం కలిగిస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, జీర్ణ సమస్యలతో బాధపడేవారికి కూడా ఈ టీ చాలా ఉపయోగపడుతుంది. మహిళలు పీరియడ్స్ సమయంలో ఎదుర్కొనే సమస్యలకు అల్లం టీ దివ్యాఔషధంగా పనిచేస్తుంది.
నడుము నొప్పి, కీళ్ల నొప్పులతో బాధపడేవారికి సైతం అల్లం టీ మెడిసిన్లా పనిచేస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపరిచేందుకు ఇది బాగా పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు మానసిక ప్రశాంతత కలిగిస్తుంది.
జింజర్ టీ చెడు కొలెస్ట్రాల్‌ని దూరం చేసి, గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. బరువు తగ్గించడంలోనూ ఇది బాగా పనిచేస్తుంది.