Home > ఆరోగ్యం > health Tips : బరువు తగ్గాలా? మధ్యాహ్నం ఇలాంటి ఆహారాలు తీసుకోండి

health Tips : బరువు తగ్గాలా? మధ్యాహ్నం ఇలాంటి ఆహారాలు తీసుకోండి

health Tips : బరువు తగ్గాలా? మధ్యాహ్నం ఇలాంటి ఆహారాలు తీసుకోండి
X

ఈ రోజుల్లో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఊబకాయం. ఈ సమస్య నుండి బయట పడడానికి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. వర్కౌట్స్, డైట్ వంటి విషయాలపై ఎక్కువగా శ్రద్ద వహిస్తుంటారు. అయితే వర్కౌట్స్, డైట్‌పై ఎంతగా శ్రద్ద పెట్టినప్పటికీ కొంత మందిలో మార్పు అనేది కనిపించదు. దీని కారణం డైట్ విషయంలో మనం చేసే కొన్ని పొరపాట్లు. ముఖ్యంగా మధ్యాహ్నం తీసుకునే ఆహారంలో విషయంలో సరైన ప్లాన్ లేకపోవడం. మరి బరువు తగ్గించే ప్రక్రియ సజావుగా కొనసాగడానికి మధ్యాహ్నం భోజనంలో ఎలాంటి డైట్ ప్లాన్ అవ్వాలి? ఎలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారో ఇప్పుడు చూద్దాం.


గ్రీన్ టీ తాగండి:

గ్రీన్ టీలో కాటెచిన్స్, కెఫిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇది జీవక్రియను పెంచుతుంది, కొవ్వును కరిగిస్తుంది. మధ్యాహ్నం తీసుకునే ఒక కప్పు గ్రీన్ టీ రిఫ్రెష్ చేయడంతో పాటు మెటబాలిజంను -బూస్టింగ్ చెస్తుంది.

ప్రోటీన్, ఫైబర్ ఆహారాలు

ప్రోటీన్, ఫైబర్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన సమతుల్య అల్పాహారాన్ని తీసుకోండి. బెర్రీలు, గింజలు, బాదం, యాపిల్స్ తీసుకోండి. చక్కెరతో కూడిన స్నాక్స్ లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలను నివారించండి. ఇవి మీ బరువు తగ్గించే ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తాయి.

హైడ్రేటెడ్ గా ఉండండి:

ఆరోగ్యకరమైన జీవక్రియను నిర్వహించడానికి రోజంతా పుష్కలంగా నీరు త్రాగటం చాలా ముఖ్యం. డీహైడ్రేషన్ జీవక్రియ, శక్తి స్థాయులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. హైడ్రేటెడ్ గా ఉండటానికి, జీవక్రియలు సజావుగా జరగడానికి మధ్యాహ్నం పుష్కలంగా నీరు త్రాగటం అవసరం

ఆహారపు అలవాట్లను మార్చుకోండి

గతం కంటే భిన్నంగా మధ్యాహ్న ఆహారపు అలవాట్లు ఉండేలా చూసుకోండి. కొవ్వులు, చక్కెరలు ఉన్న ఆహారాలను పూర్తిగా మానుకోండి

త కాసేపు అటూ ఇటూ తిరగండి

ఒకే చోట కూర్చొని పని చేసే బదులు, కాసేపు అటూ ఇటూ తిరగండి. ముఖ్యంగా భోజనం తర్వాత బయట వెళ్ళి తిరుగుతూ ఉండండి.

Updated : 12 Jan 2024 11:04 AM IST
Tags:    
Next Story
Share it
Top