Home > ఆరోగ్యం > Cracked Heels : ఈ చిట్కాలతో రాత్రికి రాత్రే కాళ్ల పగుళ్లు మాయం

Cracked Heels : ఈ చిట్కాలతో రాత్రికి రాత్రే కాళ్ల పగుళ్లు మాయం

Cracked Heels : ఈ చిట్కాలతో రాత్రికి రాత్రే కాళ్ల పగుళ్లు మాయం
X

శీతాకాలంలో స్కిన్ డ్రై అవ్వడం సహజం. చలికి చాలా మందికి కాళ్ల మడమల్లో పగుళ్లు ఏర్పడటం సహజం. పగుళ్లు ఈ సీజన్‎లో చాలా ఇబ్బంది పెడుతుంటాయి. కొంతమందిలో అయితే కాళ్ల పగుళ్లు చాలా లోతుగా ఏర్పడి భరించలేనంత నొప్పిని కలిగిస్తాయి. మరీ ముఖ్యంగా మడమల మీద ఏర్పడిన పగుళ్ల నుంచి రక్తం కారుతుంటుంది. అయితే చలికి ఇలా జరుగుతుందిలే అని అందరూ లైట్ తీసుకుంటారు. చలితో పాటు శరీరంలో జరిగే అనేక రకాల మార్పుల వల్ల ఈ సీజన్‎లో ఎక్కువగా కాళ్లకు పగుళ్లు ఏర్పడతాయి. డ్రై స్కిన్ కారణంగా కాళ్లకు పగుళ్లు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు తరచుగా ఓపెన్ బ్యాక్, హై హీల్స్ వినియోగించే స్త్రీల పాదాలపైన స్ట్రెస్ ఎక్కువగా పడి కాళ్ల పగుళ్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక వయసు పెరిగే కొద్దీ స్కిన్ తేమతో పాటు స్థితిస్థాపకతను కోల్పోతుంది. దీని ప్రభావం ముఖం, మెడ మీద మాత్రమే కాకుండా..మడమల మీద పడటంతో కాళ్ల పగుళ్లు ఏర్పాడతాయి.​ స్నానం చేసిన తర్వత పాదాలను మాయిశ్చరైజ్‌ చేయకపోయినా పొడిగా మారి పగుళ్లు ఏర్పడతాయి. ఎక్కువసేపు నిలబడినా, నడిచినా పాదాలపై ఒత్తిడి పెరిగి పగుళ్లు ఏర్పడతాయి. బట్టలు ఉతికేప్పుడు సబ్బునీళ్లలో ఎక్కువసేపు ఉండటం వల్ల కూడా ఈ సమస్య వస్తుంటుంది. దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటిస్‌, థైరాయిడ్ సోరియాసిస్ వంటి సమస్యలు ఉన్నవారిలోనూ పాదాల పగుళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఈ పాదాల పగుళ్లను ఇంట్లోనే కొన్ని సహజసిద్ధమైన టిప్స్‎తో నివారించవచ్చు.

శీతాకాలంలో పెట్రోలియం జెల్లీ అందరి ఇంట్లో ఉంటుంది. కాబట్టి కాళ్ల పగుళ్లతో బాధపడేవారు రాత్రి నిద్రపోయే ముందు కాళ్లను బాగా నీళ్లల్లో నానబెట్టి స్క్రబ్బర్‌ లేదా ప్యూమైన్‌ స్టోన్‌తో రుద్దాలి. ఆ తర్వాత..పొడి టవల్‌తో తుడిచి ఈ పెట్రోలియం జెల్లీని రాయాలి. ఆ తర్వాత కాళ్లకు కాటన్‌ సాక్స్‌ వేసుకోవాలి. ఇలా వారం పాటు క్రమం తప్పకుండా చేయడం వల్ల కాళ్ల పగుళ్లును దూరం చేయవచ్చు. ఇక చలికాలంలో కోకోనట్ ఆయిల్ చక్కని మాయిశ్చరైజింగ్ ఏజెంట్‌లా పని చేస్తుంది. గోరువెచ్చని నీటితో.. కాళ్లను శుభ్రంగా కడుక్కుని ఆ తర్వాత బాగా ఆరనిచ్చాక గోరువెచ్చటి కొబ్బరినూనెను కాళ్లకు అప్లై చేసుకుని మసాజ్‌ చేయాలి. ఆ తర్వాత కాటన్‌ సాక్స్‌ వేసుకుని నిద్రపోవాలి. ఉదయం లేవగానే నార్మల్ వాటర్‎తో వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా పగుళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతే కాదు కోకోనట్ ఆయిల్‎లో పసుపు కలిపి దానిని పగుళ్లు ఉన్న చోట రాయాలి. ఇలా చేయడం వల్ల నూనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబియల్‌ గుణాలు కాళ్ల వాపు , నొప్పితో పాటు పగుళ్లను తగ్గిస్తాయి.

ఇక పాదాల పగుళ్లను తగ్గించడంలో వెన్న బాగా ఎఫెక్టివ్‎గా పనిచేస్తుంది. పాదాలను గోరువెచ్చని నీటితో కడిగి శుభ్రం చేసుకుని ఆరిన తర్వాత వెన్నతో మసాజ్‌ చేయాలి. ఆ తర్వాత సాక్స్ వేసుకుని రాత్రి పడుకోవాలి. ఇలా పాదాలకు వెన్న రాసుకోవడం వల్ల రెండు రోజుల్లోనే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇక అరటిపండు గుజ్జు కూడా పాదాల పగుళ్లను నివారించేందుకు చక్కగా పనిచేస్తుంది. అరటిపండులో ఉండే ఎ, బి6, సి విటమిన్లు స్కిన్‎ని మృదువుగా మారుస్తాయి. అందుకే పగిలిన పాదాలకు అరటిపండు గుజ్జు రాస్తుండాలి. తేనె మంచి యాంటీసెప్టిక్‌. హనీలో కాస్త నిమ్మరసం కలిపి పాదాలకు రాసుకుంటే బెస్ట్ రిజల్ట్స్‌ చూడవచ్చు. ఒక టబ్‌లో పాదాలు మునిగేవరకు గోరువెచ్చని నీరు తీసుకోవాలి. అందులో రెండు చెంచాల తేనె వెయ్యాలి. ఆ టబ్ లో పది నిమిషాల వరకు పాదాలను ఉంచాలి. ఆ తర్వాత పగిలిన ప్రాంతాన్ని మృదువుగా రుద్దాలి. తద్వారా సహజసిద్ధ మాయిశ్చరైజర్‌లా తేనె పని చేస్తుంది. బ్యాక్టీరియాను సైతం దూరం చేస్తుంది.ః



Updated : 30 Dec 2023 12:20 PM IST
Tags:    
Next Story
Share it
Top