వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తీసుకోవాల్సిందే
X
వేసవి కాలం వెళ్ళిపోయింది...వర్సాకాలం వచ్చేసింది. దాంతో పాటే సీజనల్ వ్యాధులూ వచ్చేస్తాయి. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, జలుబులు, దగ్గులు, జ్వరాలు అన్నీ ఎటాక్ అవుతాయి. వీటిబారిన పడకుండా ఉండాలంటే మనింట్లో దొరికే కొన్ని పదార్ధాలను రోజూ తీసుకోవల్సిందే. మందులు వాడకుండా మన శరీరాన్ని హాయిగా చూసుకోవచ్చును.
వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడమే అన్ని రకాల జబ్బులకూ కారణం. కాబట్టి దాన్ని పెంచుకుంటూ ఉంటే జబ్బులు మనదరికి చేరమన్నా చేరవు. అలా ఉండాలంటే ఈ పదార్ధాలను తప్పనిసరిగా తీసుకోవల్సిందే. వాటిల్లో మొదటిది నిమ్మకాయ. ఇందులో విటమిన్ సి, పొటాషియం, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఇమ్యునిటీని పెంచుతాయి.
కరివేపాకు
కరివేపాకులో చాలా పోషకాలు ఉంటాయి. వర్షాకాలంలోనే కాదు ఎప్పుడు దీన్ని తీసుకున్నా మన శరీరానికి మేలును చేకూరుస్తూనే ఉంటుంది.
మిరియాలు:
వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్, మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి క్రిముల నుంచి దూరంగా ఉంచుతాయి.
అల్లం:
ఇది యాంటీ యాక్సిడెంట్, యాంటీ ఇన్ఫరమేటరీగా ఉపయోగపడుతుంది.ఇది ఫ్లూని నిరోధిస్తోంది.