Home > ఆరోగ్యం > IRDAI : ఇకపై అన్ని ఆసుపత్రుల్లో క్యాష్‌‌లెస్ ట్రీట్‌‌మెంట్

IRDAI : ఇకపై అన్ని ఆసుపత్రుల్లో క్యాష్‌‌లెస్ ట్రీట్‌‌మెంట్

IRDAI : ఇకపై అన్ని ఆసుపత్రుల్లో క్యాష్‌‌లెస్ ట్రీట్‌‌మెంట్
X

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌‌‌‌డీఏఐ) దేశవ్యాప్తంగా కొత్త రూల్‌‌ అమలులోకి తీసుకొచ్చింది. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న ఏ వ్యక్తి అయినా.. ఇకపై అన్ని ఆసుపత్రుల్లో క్యాష్ లెస్ పద్ధతిలో వైధ్యం చేయించుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో పాలసీ తీసుకుంటే.. ఆ కంపెనీకి సంబంధించిన నెట్ వర్క్ హాస్పిటల్ లోనే క్యాష్ లెస్ విధానంలో ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉండేది. నెట్ వర్క్ లో లేని హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటే.. మొదట బిల్లు కట్టి, తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి బిల్లులు పంపాల్సి ఉండేది. అప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ రీయంబర్స్మెంట్ చేసేది. దీనివల్ల ఇన్సూరెన్స్ చేసుకున్నా.. డబ్బులు ఉంటేనే ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి ఏర్పాడింది.

సామాన్యులను ఆపదలో ఆదుకోవాల్సిన ఇన్సూరెన్స్.. ప్రాథమిక లక్ష్యానికి ఈ రూల్ అడ్డుగా ఉందని చాలామంది వాదనలు వినిపిస్తుంటారు. ఈ నిబంధనను తొలగించి అన్ని హాస్పిటల్స్ ను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలనేది వారి వాదన. ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్ కంపెనీలతో ఐఆర్‌‌‌‌డీఏఐ చాలాసార్లు చర్చించింది. దానికి కంపెనీలన్నీ కొన్ని కండీషన్స్ తో ఒకే చెప్పాయి. కాగా ఈ కొత్త రూల్ వచ్చేవారం నుంచి అమల్లోకి రానుంది.

ఈ కొత్త రూల్ ప్రకారం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి తనకు నచ్చిన, అందుబాటులో ఉన్న హాస్పిటల్ లో చికిత్స తీసుకోవచ్చు. కానీ, ట్రీట్మెంట్ తీసుకునే ముందు సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎమర్జెన్సీలో అడ్మిట్ అయితే.. అడ్మిట్ అయిన 48 గంటల్లోపు కంపెనీకి విషయం తెలపాల్సి ఉంటుంది.




Updated : 26 Jan 2024 10:38 AM IST
Tags:    
Next Story
Share it
Top