Dinner Time : రాత్రి భోజనం ..ఏ సమయంలో చేస్తే మంచిదంటే!
X
రోజువారి దినచర్యలో ఆహారం కోసం కొంత సమయాన్ని కేటాయించుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే భోజన సమయానికి అంత్యం త ప్రాధాన్యతను ఇవ్వాలి. ముఖ్యంగా రాత్రి పూట భోజనానికి సరైనా సమయం అవసరం. సరైన సమయంలో రాత్రి భోజనం చేయడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని, అనేక రకాల వ్యాధులను మనల్ని నుండి దూరం చేస్తుందని.. ఫిట్‌గా ఉంటామని నిపుణులు అంటున్నారు.
రాత్రి భోజనం నిద్రించడానికి కొన్ని గంటల ముందు తీసుకోవాలి. ఇది బరువును అదుపులో ఉంచడమే కాకుండా షుగర్‌తో బాధపడేవారికి ఉపశమనం కలిగిస్తుంది.
కానీ మనలో చాలా మందికి రాత్రి భోజనం ఎప్పుడు చేయాలనే దానిపై సరైన అవగాహనా ఉండదు. రాత్రి భోజనం ఇన్ టైంలో చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య స్థూలకాయం. బరువు తగ్గడం, దాన్ని అదుపులో పెట్టుకోవడం నేటి కాలంలో పెద్ద సమస్యగా మారిపోయింది. దీని కోసం, వివిధ రకాల వ్యాయామాలు, ఆహారాలను అనుసరిస్తారు, కానీ అలా కాకుండా సరైన సమతుల్య జీవనశైలిని అనుసరించడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. ఈ సమతుల్య జీవనశైలిలో సమయానికి రాత్రి భోజనం చేసే అలవాటు చాలా ముఖ్యం.. అందుకే రాత్రి భోజనం త్వరగా చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.
త్వరగా రాత్రి భోజనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు-
రాత్రి భోజనం నిద్రకు కొన్ని గంటల ముందు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీలైతే, రాత్రి 7 నుండి 8 గంటల మధ్య రాత్రి భోజనం చేయాలి. దీని వల్ల ఆహారం పూర్తిగా జీర్ణం అవుతుంది. ఇది మీ బరువును అదుపులో ఉంచుతుంది. జీవక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
ఎనిమిది గంటలకు రాత్రి భోజనం చేయడం వల్ల బరువు అదుపులో ఉండటమే కాకుండా షుగర్ అదుపులో ఉంటుంది. అనేక ఉదర సంబంధిత సమస్యలు దూరమవుతాయి. రాత్రి భోజనం త్వరగా తీసుకోవడం వల్ల కూడా మంచి నిద్ర వస్తుంది.
రాత్రిపూట ఆహారం లేటుగా తీసుకునే వారు అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతే కాకుండా
వైద్యులు ప్రకారం, ఆలస్యంగా రాత్రి భోజనం చేయడం వల్ల శరీరంలో బరువుతో పాటు రక్తంలో చక్కెర స్థాయి కూడా పెరుగుతుంది. ఇది జీవక్రియపై కూడా చెడు ప్రభావం చూపుతుంది.
ముందుగానే రాత్రి భోజనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై తాజాగా నిర్వహించిన అద్యయనంలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనంలో కొంత మందికి రాత్రి ఏడు గంటలకు, మరికొంత మందికి రాత్రి పది గంటలకు రాత్రి భోజనం ఇచ్చి ఫలితాలను అంచనా వేశారు. కాని ఈ ఇద్దరికి నిద్ర సమయం మాత్రం ఒక్కేలే ఉండేలా చూశారు. అయితే పది గంటలకు రాత్రి భోజనం చేసేవారిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగి ఫ్యాట్ బర్నింగ్ ప్రక్రియ కూడా మందగించిందని ఫలితాలలో గుర్తించారు.