Home > ఆరోగ్యం > దేశంలో పెరుగుతున్న లంపి వైరస్ కేసులు.. లక్షణాలివే

దేశంలో పెరుగుతున్న లంపి వైరస్ కేసులు.. లక్షణాలివే

దేశంలో పెరుగుతున్న లంపి వైరస్ కేసులు.. లక్షణాలివే
X

దేశవ్యాప్తంగా మరోసారి లంపి వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఛత్తీస్ గఢ్ ప్రాంతంలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. లంపి వైరస్ అనేది ఒక చర్మ వ్యాధి. ఈ వైరస్ ప్రధానంగా పశువులపై ప్రభావం చూపిస్తుంది. వైరస్ సోకిన ఆవులు, ఎద్దులు కొద్ది రోజుల్లోనే చనిపోతాయి. లంపి వైరస్ ముఖ్యంగా ఈగలు, కొన్ని రకాల దోమలు, పేలు లాంటి రక్తం పీల్చే పరుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకిన జంతువుల్లో జర్వం, చర్మంపై గడ్డలు వచ్చి కొన్ని రోజుల్లోనే చనిపోతాయి. ఈ వైరస్ ను ఎలా గుర్తించాలంటే.. జంతువుల్లో చర్మమంతా పొలుసుల్లా మారుతుంది. ఎర్రని గడ్డలు వచ్చి పగులుతాయి. కంటి నుంచి నీరు కారడం, తీవ్రమైన ఒళ్లు నొప్పులు వచ్చి జంతువులకు జ్వరం వస్తుంది.

సూడి ఆవులు మొత్తం బక్కచిక్కిపోతాయి. పాల దిగుబడి తగ్గుతుంది. మేత తినలేకుండా తయారవుతాయి. అయితే ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే కంగారు పడకుండా పశువులను మొదట పశు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లి చికిత్స ఇప్పించాలి. లంపి వైరస్ అంటు వ్యాధి కావున.. ఈ వైరస్ సోకిన జంతువులను వేరే జంతువులతో కలువనివ్వకుండా చూసుకోవాలి. పశువుల కొట్టంలో దోమ తెరలు ఏర్పాటు చేయించి.. ఈగలు, దోమలు, గోమర్లు రాకుండా చూడాలి. వ్యాధి సోకిన పశువులకు దానగా రాగిజావ, నూకల జావ, పచ్చి గడ్డి, విటమిన్లు పెట్టాలి.


Updated : 18 Aug 2023 6:08 PM IST
Tags:    
Next Story
Share it
Top