Teath : దంతాలు పచ్చగా మారుతున్నాయా.. ? వీటికి దూరంగా ఉండండి
X
దంతాలు స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అవి రంగు మారుతుంటాయి. పసుపు పచ్చగా తయారవుతాయి. దీంతో నలుగురిలో నవ్వాలన్నా మొహమాటపడే పరిస్థితి ఏర్పడుతుంది. నోరు శుభ్రంగా ఉండాలంటే దంతాలు పరిశుభ్రంగా ఉండాలి. లేదంటే పళ్లు పుచ్చిపోవటం, నోరు వాసన రావటం, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవటం వంటి ప్రాబ్లమ్స్ వేధిస్తాయి. దంతాలు హెల్దీగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టే. ఎందుకంటే తినే ఆహారమంతా నోటి నుంచే పోతుంది కాబట్టి, ముందు నోరు శుభ్రంగా ఉండటం తప్పనిసరి. అయితే కొంత మంది ఎన్ని జాగ్రత్తలు పాటించినా వారి దంతాలు అంత అందంగా కనిపించవు. పసుపు పచ్చగా మారిపోతుంటాయి. అయితే కొన్ని చిట్కాలతో మీ దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు.
మిలమిలలాడే తెల్లటి దంతాలు మనలో కాన్ఫిడెన్స్‌ని పెంచుతాయి. అయితే, ఆమ్లం ఎక్కువగా ఉండే ఫుడ్స్ వల్ల పండ్ల పైపొర ఎనామిల్ దెబ్బతిని వయసు పెరిగేకొద్దీ అవి పచ్చబడతాయి. కొన్ని ఆహారాలు, డ్రింక్స్ వల్ల కూడా దంతాలు పసుపు పచ్చగా మారే అవకాశం ఉంది. స్ట్రాంగ్‌గా ఉండే బ్లాక్ కాఫీ, టీ లతో పండ్ల మీద మచ్చలు ఏర్పడతాయి. కాబట్టి వీటిని తీసుకునే విషయంలో కాస్త పరిమితి ఉండాలి. ఆమ్లత్వం అధికంగా ఉండే డ్రింక్స్ వల్ల కూడా పళ్లు పచ్చగా మారుతాయి. ఒక్కోసారి దంతాలు పుచ్చిపోతుంటాయి. ఆమ్లత్వాన్ని కలిగివున్న ఊరగాయలు కూడా పళ్లపై ఉండే ఎనామిల్‌ను ధ్వంసం చేసి పచ్చదనానికి కారణం అవుతాయి. ఇక టమాటా సాస్ కూడా దంతాలు పచ్చబడటానికి కారణమవుతాయి. ద్రాక్ష, దానిమ్మ రసాలు కూడా దంతాల మీద పచ్చదనానికి దారితీస్తాయి. కాబట్టి, దానిమ్మ, గ్రేప్ జ్యూస్‌లు తీసుకున్న తర్వాత నోరు కడుక్కోవడం మర్చిపోవద్దు. మసాలాలు దట్టించిన కూరలు తిన్నా తర్వాత దంతాలు పచ్చబడతాయి. కాబట్టి అవి తిన్న తర్వాత తప్పనిసరిగా బ్రష్ చేసుకోవాలి.
అరటి , బత్తాయి, సంత్ర , నిమ్మ వంటి పండ్ల తొక్కలలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. అది దంతాలు తెల్లగా మెరిసేలా చేస్తుంది. రోజూ పళ్లు తోముకునే ముందు అరటి పండు తొక్కలతో దంతాలపై రుద్దాలి. ఆ తర్వాత బ్రష్ చేయాలి. ఈ టిప్ కొద్దిరోజులు ఫాలో అయితే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అరటిపండే కాదు బత్తాయి, నిమ్మతొక్కలతో అయినా దంతాలను ఉదయం రుద్దాలి. ఆ తరువాత బ్రష్ చేయాలి. ఇవే కాదు బొగ్గు కూడా దంతాలు మెరిసేలా చేస్తుంది. దంతాలను తెలుపుగా మార్చడమే కాదు నోట్లో ఉండే విషపూరితాలను, బ్యాక్టీరియాలను తరిమికొడుతుంది. కోకోనట్ ఆయిల్ తోనూ ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఓ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను నోట్లో పోసుకుని ప్రతి రోజు ఓ 10 నిమిషాలు పుక్కిలించాలి. ఆ తర్వాత ఆ నూనెను ఉమ్మివేయాలి. అనంతరం బ్రష్ చేసుకోవాలి. దంతాలను తెల్లగా మార్చే గుణం బేకింగ్ సోడాలో ఉంటుంది. కొంత బేకింగ్ సోడాను తీసుకుని అందులో కొన్ని చుక్కలు నీరు కలిపి పేస్టులా మార్చి బ్రష్ చేసుకోవాలి. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఇలా చేస్తే దంతాలు పసుపు రంగు నుంచి తెలుపు రంగులోకి మారతాయి.