Home > ఆరోగ్యం > WHO Alert : కరోనా మరో కొత్త వేరియంట్..

WHO Alert : కరోనా మరో కొత్త వేరియంట్..

WHO Alert : కరోనా మరో కొత్త వేరియంట్..
X

గత మూడేళ్లుగా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చింది అనుకుంటే.. కొత్త కొత్త వేరియంట్ లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన కొత్త వేరియంట్ లతో ఎలాంటి ప్రమాదం జరగకపోయినా.. అనుక్షణం ప్రజలు భయపడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పిడుగులాంటి వార్త చెప్పింది. అమెరికాలో కొత్త రకం కరోనా వేరియంట్ పుట్టుకొచ్చిందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ దేశాలకు అలర్ట్ లు జారీ చేసింది. బీఏ.2.86గా పేర్కొన్న ఈ వేరియంట్ ను అమెరికా, డెన్మార్క్, ఇజ్రాయెల్ దేశాల్లో గుర్తించారు అమెరికా సైంటిస్టులు.

దీనిపై డబ్ల్యూహెచ్ వో కూడా స్పందించింది. ఈ వైరస్ త్వరగా వ్యప్తి చెందుతుందని, కొత్త రకంగా మారే అవకాశం కూడా ఉందపి తెలిపింది. దీంతో అప్రమత్తమైన అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం ఈ వైరస్ ను ట్రాక్ చేసే పనిలో పడింది. ప్రస్తుతం డబ్ల్యూహెచ్ వో, అమెరికా ప్రపంచ దేశాలతో ఈ వేరియంట్ విషయాలు పంచుకుంటోంది.



Updated : 18 Aug 2023 10:27 PM IST
Tags:    
Next Story
Share it
Top