Home > ఆరోగ్యం > Water Bottle వాటర్ బాటిల్‌ యమ డేంజర్.. ఒక్క ప్లాస్టిక్‌ బాటిలో‌లో ఎన్ని కణాలు ఉంటాయో తెలుసా!

Water Bottle వాటర్ బాటిల్‌ యమ డేంజర్.. ఒక్క ప్లాస్టిక్‌ బాటిలో‌లో ఎన్ని కణాలు ఉంటాయో తెలుసా!

Water Bottle వాటర్ బాటిల్‌ యమ డేంజర్.. ఒక్క ప్లాస్టిక్‌ బాటిలో‌లో ఎన్ని కణాలు ఉంటాయో తెలుసా!
X

వాటర్ బాటల్ వినియోగం విస్తృతంగా పెరిగిపోయింది. అయితే మనం ఉపయోగించే వాటర్ బాటిల్స్‌కు సంబంధించి తాజా అధ్యయనంలో షాకింగ్ న్యూస్ వెల్లడైంది. మనం ఉపయోగించే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ శరీరానికి చాలా హానికరమని ఈ అధ్యయనంలో నిరూపితమైంది. అమెరికాలో నిర్వహించిన ఈ తాజా అధ్యయనంలో స్టోర్లలో విక్రయించే ప్లాస్టిక్ బాటిల్ వాటర్‌లో మిలియన్ల కొద్దీ సూక్ష్మ కణాలు ఉన్నాయని, అవి శరీర కణాలపై ప్రభావం చూపతాయని వెల్లడైంది. ఈ అధ్యయన వివరాలు 'ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్'లో ప్రచురించబడింది.

ఈ అధ్యయనంలో, ఒక లీటరు బాటిల్ వాటర్‌లో సగటున 2.40 లక్షల ప్లాస్టిక్ కణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బాటిల్‌లో ఉండే 90 శాతం కణాలు నానోప్లాస్టిక్‌లు కాగా, మిగిలినవి మైక్రోప్లాస్టిక్‌లని నిర్ధారించారు. నానోప్లాస్టిక్‌లు చాలా చిన్నవి కాబట్టి అవి జీర్ణాశయం లేదా ఊపిరితిత్తుల కణజాలం ద్వారా రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయని, దీనివల్ల హానికరమైన ప్లాస్టిక్ శరీర కణాల అంతటా వ్యాపించి ఆనారోగ్యానికి కారణమవుతాయని అధ్యయనంలో వివరించారు. వాటర్ బాటిల్‌లోని నీటికి బదులుగా గ్లాస్ లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్లలో పంపు నీటిని తాగండి ఉత్తమం అని ప్లాస్టిక్‌లో ప్యాక్ చేసిన వ్యాటర్ తాగడం ప్రమాదమని తెలిపారు.

ముఖ్యంగా చిన్నపిల్లలు ప్లాస్టిక్ కణాలతో కూడిన వాటర్‌ను తాగడం చాలా ప్రమాదం అధ్యయన శాస్త్రవేత్త జేన్ హౌలిహాన్ తెలిపారు. ఇక అధ్యయనం కోసం, కొలంబియా విశ్వవిద్యాలయ పరిశోధకులు రామన్ స్కా రింగ్ మైక్రోస్కోపీ అనే కొత్త సాంకేతికతను ఉపయోగించారు, ఇది బాటిల్ వాటర్‌లోని ప్లాస్టిక్ కణాల రసాయన కూర్పును చూడగలదు, విశ్లేషించగలదు. లేజర్ ఆధారిత సాంకేతికతతో కాంతికి ప్రతిస్పందనగా అణువుల కంపనాలను కొలవడం ద్వారా కణాల రసాయన కూర్పును విశ్లేషించగలదు. ఇలా బ్రాండ్ల బాటిళ్లలో 1,10,000 నుంచి 3,70,000 ప్లాస్టిక్ రేణువులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

Updated : 9 Jan 2024 9:34 PM IST
Tags:    
Next Story
Share it
Top