Home > ఆరోగ్యం > బీకేర్ ఫుల్: ఆ వైరస్ వ్యాపిస్తోంది. ఈ తప్పులు చేశారా..! ఇక మీ కళ్లు అంతే

బీకేర్ ఫుల్: ఆ వైరస్ వ్యాపిస్తోంది. ఈ తప్పులు చేశారా..! ఇక మీ కళ్లు అంతే

బీకేర్ ఫుల్: ఆ వైరస్ వ్యాపిస్తోంది. ఈ తప్పులు చేశారా..! ఇక మీ కళ్లు అంతే
X

రాష్ట్ర వ్యప్తంగా కండ్ల కలక కలవర పెడుతోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా.. అందరిలో వేగంగా వ్యాపిస్తోంది. దాంతో రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. వందల సంఖ్యలో జనాలు హాస్పిటల్ కు క్యూ కడుతున్నారు. వేగంగా ఈ వ్యాధి వ్యాపిస్తుండటంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. కండ్ల కలక సీజనల్ వ్యాధని, వర్షాలకు వల్ల జరిగే నీటి కాలుష్యంతో ఇన్ఫెక్షన్ వచ్చి ఈ వ్యాధి సోకుతుందని డాక్టర్లు చెప్తున్నారు. వర్షాల వల్ల గాలిలో తేమ, చెమ్మ కారణంగా వైరస్ లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వల్ల ఇది వ్యాపిస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం హాస్పిటల్ బారిన పడుతున్న వాళ్లలో అడెనీ వైరస్ ఉందని పరీక్షల్లో తేలింది. ఈ క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే దీనివల్ల జరిగే పరిణామాలను వివరిస్తున్నారు డాక్టర్లు.

తాకకూడనివి:

మన చుట్టూ ఎవరికైనా కండ్ల కలక వస్తే వాళ్లకు దూరంగా ఉండటం మంచిది. వాళ్లు వాడే ఏ వస్తువును వాడకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో తాకితే.. వెంటనే చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. కండ్ల కలక వచ్చినవాళ్లు తప్పనిసరిగా నల్ల కళ్లద్దాలు వాడాలి. బయటికి వెళ్లొచ్చిన వెంటనే గోరువెచ్చని నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ కండ్ల కలక బారిన పడితే.. సొంత వైద్యం చేసుకోకుండా.. డాక్టర్ ను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

ఇది ప్రమాదం

సాధారణంగా కండ్ల కలక వస్తే వారంలో తగ్గిపోతుంది. కానీ, అడెనో వైరస్‌తో కండ్ల కలక వస్తే మూడు వారాలపాటు ఉంటుంది. నవజాత శిశువులు, నెలలోపు వయసు ఉన్న వారిలో వస్తే మాత్రం ప్రమాదంగా మారుతోంది. తెల్లనిపొర నుంచి కంటిగుడ్డు కార్నియాకు విస్తరిస్తే చూపు మందగిస్తోంది. కార్నియాకు ఇన్‌ఫెక్షన్‌ సోకి అల్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. రంధ్రాలు పడే అవకాశం కూడా ఉంటుందని ఇలాంటి పరిస్థితి వస్తే చూపుకోల్పోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. కళ్ళ కలక వారంలో తగ్గనట్లైతే నేత్ర వైద్య నిపుణుల్ని సంప్రదించి వారి సూచనల మేరకు మందులు వాడటం మంచిది.

Updated : 3 Aug 2023 6:14 PM IST
Tags:    
Next Story
Share it
Top