Eye care Tips : మీకు 40 ఏళ్లు దాటాయా? అయితే ఈ విషయంలో జాగ్రత్త
X
40 ఏళ్లు దాటిన తర్వాత కళ్లపై జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. వయసు పెరిగే కొద్దీ కళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి వయసు పెరుగుతున్న కొద్ది కంటి ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మంచిది. చూపులో తేడాలు వస్తే డాక్టర్‌ను సంప్రదించి వైద్య సలహాలను పాటించాలి. అవసరమైతే అద్దాలు ఉపయోగించాలి. కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌లలో ఎక్కువగా పని చేయాల్సిన వారు మరి జాగ్రత్తగా ఉండాలి. తరచుగా వారి కళ్లు పొడిబారిపోతు ఉంటాయి. ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. దీనిపై నేత్ర వైద్య నిపుణుల సలహాలు ఏమిటో చూద్దాం...
కళ్లు పొడిబారిపోతు ఉంటే స్క్రీన్ టైమ్ తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మొబైల్ స్క్రీన్‌కు బదులుగా పెద్ద స్క్రీన్‌ని ఉపయోగించడానికి ప్రయత్నించండి . రోజుకు రెండు మూడు సార్లు చల్లని, శుభ్రమైన నీటితో కళ్లను కడగాలి. కళ్లు పొడిబారినట్లయితే డాక్టర్ సలహా మేరకు లూబ్రికెంట్ ఐ డ్రాప్స్ వేసుకోవాలి. ఇది కళ్లు పొడిబారకుండా కాపాడుతుంది. మీరు స్క్రీన్‌పై ఎక్కువగా పని చేస్తే ప్రతి 20 నిమిషాలకు, 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరం నుంచి చూడండి. దీంతో కళ్లకు ఉపశమనం కలుగుతుంది.
40 ఏళ్ల తర్వాత, గ్లాకోమా వచ్చే అవకాశం ఉన్నందున పరీక్ష చేయించుకోండి, కాబట్టి సమస్య లేకపోయినా పరీక్షలు చేయించుకుంటూ ఉండండి. మధుమేహం , అధిక రక్తపోటు మొదలైనవి ఉన్నవారు ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి వారి కళ్లను చెక్ చేసుకోవాలి. ఎవరికైనా మధుమేహం, రక్తపోటు లేదా మరేదైనా వ్యాధి ఉంటే, ప్రతి ఆరు నెలలకోసారి తన కళ్లను పరీక్షించుకోవాలి.
రెటీనా దెబ్బతిన్న తర్వాత, దానిని మెరుగుపరచడానికి చికిత్స అవసరం. మీకు ఏదైనా దృష్టి సమస్య ప్రారంభమైతే, దానిని విస్మరించవద్దు ఎందుకంటే ఇది కళ్ల నరాలపై ఒత్తిడి తెస్తుంది. వాటిని క్రమంగా దెబ్బ తీస్తుంది. వైద్య సలహా లేకుండా కళ్లలో ఎలాంటి మందులు వేసుకోవద్దు. ఇంటి నుంచి బయటకు వెళితే అద్దాలు ధరించండి. హెల్మెట్ ఉపయోగించండి.