Home > ఆరోగ్యం > Sleeping Naked: చలికాలంలో బట్టలు లేకుండా నిద్ర.. ప్రయోజనాలెంటో తెలుసా?

Sleeping Naked: చలికాలంలో బట్టలు లేకుండా నిద్ర.. ప్రయోజనాలెంటో తెలుసా?

Sleeping Naked: చలికాలంలో బట్టలు లేకుండా నిద్ర.. ప్రయోజనాలెంటో తెలుసా?
X

ఆరోగ్యవంతమైన జీవనశైలికి నిద్ర అత్యంత ఆవశ్యకమైన అంశం. ఆరోగ్యంగా ఉండాలంటే కంటి నిండా కునుకు ఉండాల్సిందే. సరైనా నిద్ర లేకపోతే నీరసం, మానసిక ఆందోళన వంటి రుగ్మతలు వస్తుంటాయి. మనిషికి రోజులో కనీసం 7నుండి 8 గంటలు నిద్ర అవసరం.

నిద్ర అవసరమవుతుంది. కంటి నిండా కునుకు తీయాలంటే చూట్టూ వాతావరణం అందుకు అనుకూలంగా ఉండాలి. అప్పుడే కంటి నిండా ఉంటుంది. లేకపోతే మాత్రం ఆ రాత్రి జాగారమే. అయితే వీటి అన్నింటికీ భిన్నంగా చలి కాలంలో మాత్రం

వద్దన్నా నిద్రపోవాలని అనిపిస్తుంది. వింటర్ సీజన్‌లో మాత్రం సాధారణ రోజుల కంటే ఎక్కువ గంటలు నిద్రపోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. వణకు పుట్టించే చలిలో వెచ్చటి దుప్పటిలో దూరిపోయి నిద్రపోతే ఆనందమే వేరు..

కానీ అదే చలిలో బట్టలు లేకుండా పడుకోవడమంటే.. సాహసమనే చెప్పాలి.

కానీ చలికాలంలో ఒంటిపై నూలిపోగు లేకుండా నిద్రపోతే ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నయట.. మరి అవేంటో చూద్దామా...

చలి కాలంలో బట్టలు లేకుండా పడుకోవడం వల్ల బాగా నిద్ర పట్టడంతో పాటుగా ఒత్తిడి కూడా తగ్గుతుందట

చలి కారణంగా చాలా మంది బిగుతుగా ఉండే దుస్తులు ధరిస్తారు.. దుప్పట్లో ముడుచుకొని నిద్రపోతుంటారు. దీని వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి.

కాబట్టి నగ్నంగా నిద్ర పోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుంది.

బట్టలు లేకుండా నిద్ర పోవడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతలు మెయింటైన్‌ అవుతాయట. దీంతో అధిక చెమటలు పట్టకుండా ఉంటుంది

సహజంగానే శరీరం వాతావరణ మార్పులకు తగ్గట్టుగా తనలో మార్పులు చేసుకుంటుదట.. కానీ వెచ్చని దుస్తులు ధరించడం వల్ల శరీరానికి బయట వాతావరణ పరిస్థితులు అవగాహనా లేకుండా పోతుంది.

కాబట్టి నగ్నంగా పడుకోవడం వల్ల శరీరంలో సహజమైన మార్పులకు అస్కా రం ఉంటుంది.

నగ్నంగా నిద్రపోవడం వల్ల శరీరంలో ఆక్సిజన్, పోషకాల స్థాయులు పెరుగుతాయి. దీంతో బాడీపై ముడతలు, వృద్దాప్య సంకేతాలు రాకుండా ఉంటుంది.

నగ్నంగా నిద్రపోవడం వల్ల నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుందట

శరీరంలో ఉండే అధిక కేలరీలను కూడా తగ్గుతాయి. ఇది బరువు నియంత్రించడంలో సహాయపడుతుంది

ఇన్ఫెక్షన్ల సోకకుండా కూడా శరీరాన్ని కాపాడుతుంది

నగ్నంగా నిద్రపోవడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

Updated : 1 Jan 2024 12:44 PM IST
Tags:    
Next Story
Share it
Top