Home > ఆరోగ్యం > టేస్ట్ బాగుందని రోజూ ఇవే తింటున్నారా? ఈ షాకింగ్ సర్వే మీకోసమే

టేస్ట్ బాగుందని రోజూ ఇవే తింటున్నారా? ఈ షాకింగ్ సర్వే మీకోసమే

టేస్ట్ బాగుందని రోజూ ఇవే తింటున్నారా? ఈ షాకింగ్ సర్వే మీకోసమే
X

భారతదేశం ప్రపంచానికి మధుమేహ రాజధానిగా మారుతోంది. యువతలో గుండె జబ్బులు అధికమవుతున్నాయి. రెస్టారెంట్లలో ఆహారం తినడం వల్లే ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చాలా మంది అపోహపడుతుంటారు. నిజానికి ప్రతి ఒక్కరు రెస్టారెంట్లలో నెలకు సగటున 6 సార్లు మాత్రమే తింటారని అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే రోజుకు 3 పూటలు లెక్కేసుకున్నా నెలలో మిగిలిన 84 సార్లు ఇంట్లోనే భోజనం చేస్తున్నారు. మరి ఇంటిపట్టునే ఆహారం తింటున్నా ఎందుకు తరచుగా జబ్బుల బారిన పడుతున్నాం? నెలలో కనీసం ఒక్కసారైనా ఆస్పత్రికి ఎందుకు వెళ్తున్నాం? అనే సందేహం అందరిలో ఉత్పన్నమవుతోంది. దీనంతటికీ ప్రధాన కారణం మన ఇంటిని ఓ రెస్టారెంట్‏గా మార్చడం వలనే అని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అవసరానికి మించి ప్యాకేజ్డ్ ఫుడ్‎ను నిత్యం తీసుకోవడమే ఇన్ని అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఎక్కువ రోజులు కవర్లలో నిల్వ ఉన్న, తక్కువ నాణ్యత కలిగిన ఈ ప్యాకేజ్డ్ ఫుడ్ మానషి ఆరోగ్యానికి ముప్పు వాటిల్లేలా చేస్తోంది.

ప్రపంచంలోనే అత్యంత అనారోగ్యకరమైన ఫుడ్ :





తాజా అధ్యయనాల ప్రకారం, భారతదేశంలోని ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రపంచంలోనే అత్యంత అనారోగ్యకరమైన ఫుడ్ అని తేలింది. ప్రపంచవ్యాప్తంగా 4 లక్షల ఉత్పత్తులను విశ్లేషించిన ఒక అధ్యయనంలో ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ ప్యాకేజ్డ్ ఫుడ్‌లో షుగర్, ఉప్పు,సాచ్యురేటెడ్ ఫ్యాట్స్, కేలరీలు ఎక్కువగా ఉన్నాయని తేలింది.

అవసరానికి మించి తింటే అనారోగ్యమే :





చాలా మంది భారతీయులు ఇంట్లో నిత్యం తినేది ఈ ప్యాకేజ్డ్ ఫుడ్సే. ఈ ఫుడ్ తినే ఆహారాన్ని రుచిగా చేస్తాయి. రుచిగా ఉన్నాయి కదా అని లొట్టలేసుకుని తింటే మాత్రం ఊబకాయం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు ,మధుమేహం వంటి తీవ్రమైన ఆరోగ్యసమస్యల బారిన పడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫ్రెష్, టేస్టీ అండ్ హెల్దీ అంటూ విక్రయించే ఈ ప్యాక్ చేసిన ఆహారాలే ఇన్ని అనర్థాలకు కారణాలు. ఉదయం లేచింది మొదలు పిల్లలకు అందించే బ్రేక్ ఫాస్ట్ నుంచి సాయంత్రం ఇచ్చే స్నాక్స్ వరకు అన్నీ కూడా ప్యాక్ చేసిన ఫుడ్సే. అవసరానికి మించి వీటిని తీసుకోవడం వల్లనే పిల్లల్లోనూ ఎన్నో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇంట్లో వండిన ఆహారమే ఆరోగ్యం :

మనకంటే ముందు తరం వారు మనకంటే బలంగా, ఆరోగ్యంగా ఉండేవారు. అప్పట్లో తాతలు , అమ్మమ్మనాయనమ్మల మాటలను వింటూ వారు వండి వడ్డించిన తాజా ఆహారాన్ని తింటూ ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఇప్పటి బీజీ లైఫ్‎స్టైల్ కారణంగా చాలా మంది ప్రాసెస్డ్ చేసిన ఫుడ్స్‎కే ప్రయారిటీ ఇస్తున్నారు. విటమిన్లు, మినరల్స్ , యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన ఆహారం అంటూ ప్రాసెస్ చేసిన ఆహారాన్ని వ్యాపార సంస్థలు వినియోగదారులకు అందిస్తున్నారు. అయితే తయారీదారులు ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ పరిమాణం ఎంత, వాటిలో ఏఏ పదార్థాలను వినియోగించారో బహిర్గతం చేయరు. సూపర్ మార్కెట్‎కు వెళ్లి వీటిని కొనుగోలు చేసేముందు మాత్రం ఈ ప్రసెస్డ్ ఫుడ్ రోజువారీ ఆహారంలో అవసరమైన పోషకాలను శరీరానికి అందిస్తాయా? ప్యాక్ చేసిన ఆహారాలు నిజంగా ఆరోగ్యకరమైనవేనా? అనే సందేహం ఒక్క క్షణం కలుగుతుంది. అయినప్పటికీ ఆ సందేహాన్ని పక్కన పెట్టి ఈ ప్రాడక్ట్స్‎ను కొనుగోలు చేస్తాం. ఇంటి ఫుడ్ తినాలి అంటే ఇంట్లో ప్యాకేజ్డ్ ఫుడ్ తినడం కాదు. ఇంట్లో వండిన ఆహారాన్ని తినడం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే జీవితం మీది, ఆరోగ్యం మీది, డబ్బు మీది, అందుకే తినే ముందు మూడుసార్లు ఆలోచించండి.






Updated : 5 Oct 2023 2:43 PM IST
Tags:    
Next Story
Share it
Top