Home > ఆరోగ్యం > JN.1 COVID-19 : తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఆ రెండు జిల్లాలో ఆరు పాజిటివ్‌ కేసులు!

JN.1 COVID-19 : తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఆ రెండు జిల్లాలో ఆరు పాజిటివ్‌ కేసులు!

JN.1 COVID-19 : తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఆ రెండు జిల్లాలో ఆరు పాజిటివ్‌ కేసులు!
X

కరోనా మళ్లీ కంగారు పెడుతుంది. తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్‌ జేఎన్‌-1 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. జిల్లాలో కూడా జేఎన్‌-1 కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలో పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు వైద్య శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రెండు జిల్లాల్లో ఆరు పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వెల్లడించారు.

కరీంనగర్‌ జిల్లాలో మెుత్తం నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులను గుర్తించారు. మహిళతో పాటు 18 నెలల బాలుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో మరో రెండు కేసులు నమోదయ్యాయి. కాబట్టి కొత్త వేరియంట్‌ జేఎన్‌-1 పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యా అధికారులు జనాలను హెచ్చరిస్తున్నారు.

మరొవైపు దేశంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు కొత్త వేరియంట్‌ జేఎన్‌-1 సంబంధించి 312 కేసులు బయటపడ్డాయి. వాటిలో కేరళలో 147, గోవాలో 51, గుజరాత్‌లో 34, మహారాష్ట్రాలో 26, తమిళనాడులో 22, ఢిల్లీలో 16, కర్ణాటకలో 8, రాజస్థాన్‌లో 5, తెలంగాణలో 2, ఒడిశా రాష్ట్రంలో ఒక కేసు నమోదు అయినట్లు ఇన్సాకాగ్‌ పేర్కొంది. మెుత్తం కేసుల్లో 47 శాతం పైగా కేరళ రాష్ట్రం నుండే ఉన్నాయి. దేశంలో పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ వేరియంట్‌ వ్యాప్తి చెందుతుంది.

Updated : 3 Jan 2024 3:36 AM GMT
Tags:    
Next Story
Share it
Top