Home > ఆరోగ్యం > Breakfast: బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా..? అయితే ఆ రోగం బారినపడ్డట్లే..!

Breakfast: బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా..? అయితే ఆ రోగం బారినపడ్డట్లే..!

Breakfast: బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా..? అయితే ఆ రోగం బారినపడ్డట్లే..!
X

"రోజువారీ ఆహారంలో అతి ముఖ్యమైనది బ్రేక్ ఫాస్ట్". ఏ పూట తిన్నా, తినకున్నా ప్రతిరోజూ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కచ్చితంగా తినాలని అంటారు. కానీ సన్నగా అవ్వాలని కొందరు, బరువు పెరుగుతున్నామని మరికొందరు, పని ఒత్తిడితో ఇంకొందరు ఉదయం అల్పాహారం తీసుకోవడం మానేస్తుంటారు. అయితే బ్రేక్‌ఫాస్ట్ పూర్తిగా మానేయడం మాత్రమే కాదు, ఉదయం వేళ ఆలస్యంగా టిఫిన్ చేసినా ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు అంటున్నారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

టిఫిన్ చేయకపోతే..

బ్రేక్ ఫాస్ట్ విషయంలో ఇటీవల చేసిన ఓ అధ్యయనంలో అనేక విషయాలు బయటపడ్డాయి. పొద్దున్నే టిఫిన్ చేయకపోతే ఏమవుతుందిలే అనుకునే వారికి షాకిచ్చాయి. జీర్ణాశయ క్యాన్సర్లకు సంబంధించి ఇటీవల దాదాపు 63వేల మందిపై ఈ స్టడీ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారంతా ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం లేదా సరైన సమయానికి తిననివారే. ఈ అధ్యయనంలో బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేసే వారు కడుపు, కాలేయం, అన్నవాహిక, కొలొరెక్టల్, గాల్ బ్లాడర్ క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం ఎక్కువని తేలింది. డైట్ల పేరుతో అల్పాహరం తీసుకోకపోతే జీర్ణవ్యవస్థపై అది తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పింది.

రోజంతా యాక్టివ్

ఉదయం నిద్రలేచాక వీలైనంత త్వరగా అల్పాహారం తీసుకోవడం మంచిదన్నది న్యూట్రిషనిస్టులు చెబుతున్న మాట. రాత్రి సమయంలో దాదాపు 8 నుంచి 10 గంటల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో జీర్ణాశయం ఖాళీగా ఉంటుంది. అందుకే వీలైనంత త్వరగా ఆహారం తీసుకుంటే మెదడు చురుకుగా పనిచేస్తుంది. అల్పాహారం ఆకలిని తీర్చడమే కాదు.. రోజంగా యాక్టివ్గా ఉండేందుకు సాయపడుతుందని న్యూట్రీషనిస్టులు అంటున్నారు.

నిపుణుల పర్యవేక్షణ

ఈ మధ్యకాలంలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బాగా పాపులరైంది. ఈ విధానంలో కొన్ని గంటల పాటు కడుపును ఖాళీగా ఉంచుతారు. రోజులో ఏం తినాలనుకున్నా 8 గంటల్లోనే తిని మిగతా 16 గంటలు ఎలాంటి ఆహారం తీసుకోరు. మరికొందరు కేవలం 6 గంటల్లోపే తినాల్సింది తిని మిగిలిన 18 గంటలు కడుపు ఖాళీగా ఉంచురారు. ఇలా చేయడం మెటబాలిజం పెరిగి వెయిట్ లాస్ అవుతారు. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఫలితాలు బాగానే ఉన్నా.. నిపుణుల పర్యవేక్షణలో చేయడం మంచిదని హెల్త్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. లేనిపక్షంలో అది నెగిటివ్ ఎఫెక్ట్ చూపి అనారోగ్యాలకు కారణమవుతుందని చెబుతున్నారు.

డైట్లతో అనారోగ్యం

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్తో పాటు మరికొన్ని డైట్ పద్దతులను జనం ఫాలో అవుతున్నారు. అయితే అవి శరీరానికి మంచి చేయకపోగా.. ఆరోగ్యాన్ని మరింత నాశనం చేస్తాయన్న న్యూట్రీషనిస్టులు అంటున్నారు. లిక్విడ్, లో కార్బ్, కీటో తదితర డైట్స్ వల్ల కలిగే ప్రయోజనం కన్నా ప్రమాదమే ఎక్కువని చెబుతున్నారు.

లిక్విడ్ డైట్.. ఈ మధ్యకాలంలో వేగంగా బరువు తగ్గేందుకు కొందరు ఈ డైట్ ఫాలో అవుతున్నారు. ఈ డైట్లో కొన్ని రోజుల పాటు కేవలం పండ్లు, వెజిటెబుల్ జ్యూసులు మాత్రమే తీసుకుంటారు. ఎలాంటి ఘన పదార్థాలు తీసుకోరు. జ్యూస్లు శరీరానికి అవసరమైన చాలా వరకు పోషకాలు అందించినా ఫైబర్, ప్రొటీన్ తదితర న్యూట్రియెంట్లు శరీరానికి అందకలేకపోవడంతో పోషాకాహార లోపం తలెత్తుతుంది.

లో కార్బ్ హై ప్రొటీన్ డైట్.. ఈ డైట్లో కార్బొహైడ్రేట్లు ఉండే ఆహారాన్ని చాలా వరకు తగ్గిస్తారు. లేదా ఎక్కువ ప్రొటీన్లున్న ఫుడ్ తీసుకుంటారు. ఈ డైట్ వల్ల శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందవు. అంతేకాదు ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ప్రోటీన్ల స్థాయి మరీ ఎక్కువైతే ఒక్కసారి కిడ్నీలు ఫెయిల్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.

డీటాక్స్ డైట్స్.. శరీరంలోని వ్యర్థాలన్నింటినీ బయటకు పంపేందుకు ఈ డైట్ ఫాలో అవుతుంటారు. అయితే దీని వల్ల బాడీలోని టాక్సిన్లన్నీ బయటకు వెళ్తాయడానికి ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. కేవలం ప్రూట్, వెజిటెబుల్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగడం వల్ల శరీరంలో సత్తువ తగ్గిపోతుంది. ఈ డీటాక్స్ డైట్ డీ హైడ్రేషన్తో పాటు పోషక లోపానికి దారి తీస్తుంది.

కీటో డైట్.. ఈ విధానం కొందరిలో సమర్థవంతగా పనిచేస్తుంది. మరికొందరికీ లేని పోని అనారోగ్యాలు తెచ్చిపెడుతుంది. కీటో డైట్లో భాగంగా హై ఫ్యాట్, లో కార్బ్ ఫుడ్ తింటారు. అయితే ఈ డైట్ కొనసాగించడం చాలా కష్టం. అంతేకాదు సరైన విధానం పాటించకపోతే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

బ్రేక్ ఫాస్ట్ తింటేనే ఆరోగ్యం

చాలా మంది డైట్ పేరుతో బ్రేక్ ఫాస్ట్ తినడం మానేస్తున్నారు. నిజానికి అల్పాహారం తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటెన్ అవుతాయి. హర్మోన్లు కూడా సరిగా పనిచేస్తాయి. నిజానికి బ్రేక్ ఫాస్ట్లో పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, ప్రొటీన్లు ఉండేలా చూసుకోవడంతో పాటు రోజూ ఒకే సమయానికి తినడం వల్ల అనేక అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. అదే డైట్ పేరుతో బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తే బయోలాజికల్ క్లాక్తో పాటు మెటబాలిజం దెబ్బతింటుంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందక, రక్తంలో చక్కెరస్థాయిల్లో గణనీయంగా మార్పు వచ్చి డయాబెటిస్, కడుపులో మంట, అల్సర్లు, చివరకు క్యాన్సర్లకు దారి తీస్తుంది. అందుకే నిత్యం బ్రేక్ఫాస్ట్ లో సమతులాహారం తీసుకొని జీర్ణవ్యవస్థతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

Updated : 26 Sep 2023 7:40 AM GMT
Tags:    
Next Story
Share it
Top