Home > ఆరోగ్యం > మహిళలు బరువు పెరుగుతున్నారా.? కారణాలు ఇవే తెలుసుకోండి..

మహిళలు బరువు పెరుగుతున్నారా.? కారణాలు ఇవే తెలుసుకోండి..

మహిళలు బరువు పెరుగుతున్నారా.? కారణాలు ఇవే తెలుసుకోండి..
X

బరువు పెరగడానికి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమ తగ్గడం వల్ల వెయిట్ గెయిన్ అవుతారని తెలుసు. అయితే క్రమంగా బరువు పెరిగితే మాత్రం లైఫ్‎స్టైల్‎లో మార్పులే కారణం అని అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఉన్నట్లుండి ఒక్కసారిగా బరువు పెరిగితే మాత్రం కచ్చితంగా అలర్ట్‌ అవ్వాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా మహిళలు ఉన్నట్లుండి బరువు పెరగడానికి పీసీఓఎస్‌ ప్రధాన కారణమవుతుందని చెబుతున్నారు. ఈ సమస్య వల్ల పీరియడ్స్‌ ఇర్రెగ్యులర్‌ అవుతాయి. శరీరంలో హార్మోన్లు దెబ్బతింటాయి. అలాగే జీవక్రియలో మార్పులు ఏర్పడతాయి. దీనితో శరీరంలో కొవ్వు పెరిగి, బరువు పెరుగుతారని తెలియజేస్తున్నారు.

వయసు పెరిగే కొద్దీ మహిళల్లో మెనోపాజ్‌ సమస్య సహజంగా కనిపిస్తుంది. ఇది స్త్రీలల్లో బరువు పెరగడానికి కారణమవుతుంది. ఈ సమస్య వల్ల మహిళల్లో ఈస్ట్రోజన్‌ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోతాయి. దీంతో ఉన్నట్లుండి బరువు పెరిగిపోతారు. పొత్తికడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. దీంతో ఆకస్మికంగా బరువు పెరుగుతారు. ఉన్నట్లుండి బరువు పెరగడానికి హైపో థైరాయిడిజం కూడా ఒక కారణం. థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయకపోతే ఈ సమస్య వస్తుంది. ఉన్నట్లుండి బరువు పెరిగి, జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతుంటే వెంటనే థైరాయిడ్ టెస్టులు చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు.

మానసిక ఒత్తిడి కూడా ఉన్నట్లుండి బరువు పెరగడానికి ఒక కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి పెరిగితే.. శరీరం కార్టిసాల్​ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒత్తిడి హార్మోన్​ను పెంచుతుంది. దీంతో తెలియకుండానే ఎక్కువగా తినేస్తుంటారు. అలా బరువు పెరిగిపోతారు. సరైన నిద్రలేకపోయినా బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి వంటి సమస్యలతో ..శరీరంలోని హార్మోన్లలో వ్యత్యాసాలు ఏర్పడుతాయి. దీంతో ఆకలి, జీవక్రియను నియంత్రించే హార్మోన్లు కంట్రోల్ తప్పుతాయి. ఈ కారణంగా అతిగా తింటుంటారు. దీంతో తెలియకుండానే బరువు పెరుగుతారు. మరి ఈ లక్షణాలను గుర్తించిన వెంటే మహిళలు వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated : 11 Dec 2023 7:11 AM GMT
Tags:    
Next Story
Share it
Top