Home > ఆరోగ్యం > Healthy Eyes : కంటి చూపు సమస్య రాకుండా ఉండాలంటే

Healthy Eyes : కంటి చూపు సమస్య రాకుండా ఉండాలంటే

Healthy Eyes : కంటి చూపు సమస్య రాకుండా ఉండాలంటే
X

సర్వేంద్రియానం నయనం ప్రధానం. కంటి చూపు మెరుగ్గా ఉన్నప్పుడే ప్రపంచాన్ని చూడవచ్చు. కానీ ప్రపంచం మొత్తం ప్రస్తుతం డిజిటల్‌ స్క్రీన్లతో నిండిపోయింది. టెలివిజన్‌, కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు.. ఇలా అనేక రకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ప్రతి ఇంట్లో ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి. ప్రతి రోజు కొన్ని గంటల సమయాన్ని స్క్రీన్స్ చూస్తూ గడిపేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఫలితంగా కంటి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. మరీ ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఒత్తిడికి కారణం అవుతుంది. స్మార్ట్ ఫోన్‌లను విపరీతంగా ఉపయోగించడం వల్ల కంటి చూపు సమస్యలు అధికమవుతున్నాయి. ఈ హాబిట్ కళ్లపై స్ట్రెస్‎ను కలిగించి అస్పష్టమైన దృష్టికి దారితీస్తుందని తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు, కంటి సమస్యలు వచ్చినపుడు ఏ పనిపై దృష్టి కేంద్రీకరించలేకపోతారు, ఏకాగ్రత దెబ్బతింటుంది. తీవ్రమైన తలనొప్పి, మెడ, వీపు అలాగే భుజాల నొప్పికి దారితీస్తుంది. మానసికంగానే, కాదు విపరీతమైన ఫోన్ల వాడకం ద్వారా శారీరకంగా స్ట్రెస్‎కు లోనవుతారు. కాబట్టి కళ్లను కాపాడుకోవడం చాలా అవసరం. కళ్లజోడు వాడేవారు సైతం దృష్టి విషయంలో ఇబ్బందులుంటే ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి అవసరం ఉందంటున్నారు నిపుణులు.

మంచి కంటి చూపుకు స్క్రీన్ టైమ్ తగ్గించడంతో పాటు, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం అవసరం. తాజా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా కంటి చూపు మెరుగవుతుంది. క్యారెట్లు తరచుగా తింటే కంటి చూపు బాగుంటుందని అంటుంటారు. ఎందుకంటే ఇందులో బీటా-కెరోటిన్ సమృద్ధిగా లభిస్తుంది. కంటి రెటీనా, కంటిలోని ఇతర పార్ట్స్ సవ్యంగా పనిచేయడానికి విటమిన్ ఎ అవసరం. ఈ బీటా-కెరోటిన్ కంటిలో విటమిన్-ఎ ఉత్పత్తికి సహాయపడుతుంది. బీటా-కెరోటిన్‎లో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు కంట్లో మచ్చలు, కంటిశుక్లం వంటి ప్రాబ్లమ్స్ నుంచి కాపాడుతుంది. లుటీన్, జియాక్సంతిన్‌ అనే ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లు సహా అనేక పోషకాలకు పవర్‌హౌస్ బచ్చలికూర. ఈ పోషకాలు న్యేచురల్‎గానే కంటికి సన్ గ్లాసెస్‎లాగా పనిచేస్తాయి. కళ్ళు దెబ్బతినకుండా కాంతి కిరణాలు, వేవ్ లెన్త్స్ నుండి కళ్ళను రక్షిస్తాయి.

ఫ్యాటీ ఫిష్‎ను కొవ్వు చేపలు అని కూడా అంటారు. వీటిలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సాల్మన్, ట్యూనా, మాకేరెల్ చేపలలో ఒమెగా-3 పుష్కలంగా లభిస్తుంది. రెటీనా కణాల నిర్మాణానికి, పొడి కళ్లకు ఇది మంచిది.

బాదం పప్పులు, అవిసె గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలలో విటమిన్-ఇ సమృద్ధిగా ఉంటుంది. ఇది గొప్ప యాంటీ ఆక్సిడెంట్. ఫ్రీ రాడికల్స్ నుండి కళ్ళలోని కణాలను రక్షిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే వయసుతో వచ్చే కంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. నారింజ, నిమ్మ, బత్తాయి వంటి సిట్రస్ ఫ్రూట్స్‎లో విటమిన్-సి ఉంటుంది. ఇది కళ్లను, కంటి కణజాలాలను క్యూర్ చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. కంటి శుక్లం, మాక్యులార్ డీజెనరేషన్ వచ్చే రిస్క్‎ని తగ్గిస్తుంది.

బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్ వంటి బెర్రీ పండ్లు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు లో బీపీ, కళ్లు పొడిబారడం, దృష్టి లోపాలు, మచ్చలను నివారిస్తాయి. అరటిపండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పొడి కళ్ళకు ఈ మూలకం అవసరం. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం రోజూ అరటిపండు తినడం మంచిది.

Updated : 17 Jan 2024 3:33 PM IST
Tags:    
Next Story
Share it
Top