Home > ఆరోగ్యం > BREAKFAST : బ్రేక్‌‎ఫాస్ట్‌ మానేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా?

BREAKFAST : బ్రేక్‌‎ఫాస్ట్‌ మానేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా?

BREAKFAST : బ్రేక్‌‎ఫాస్ట్‌ మానేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా?
X

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిని ఏదో ఒక హెల్త్ ఇష్యూ వేధిస్తోంది. మరీ ముఖ్యంగా కరోనా వైరస్ వచ్చినప్పటి నుండి ఎన్నో అరోగ్య సమస్యలను ఎంతో మంది ఎదుర్కొంటున్నారు. వాటిలో ప్రధానమైనది హార్ట్ అటాక్. వయసుతో సంబంధం లేకుండా గత కొంత కాలంగా గుండె పోటుతో చనిపోయే వారి సంఖ్య పెరిగింది. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అందులో ఆహారం ప్రధానమైనది. సమయానికి ఫుడ్ తీసుకోకపోయినా హార్ట్ ఎటాక్ వచ్చే రిస్క్ అధికంగా ఉంటుందని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అల్పాహారం విషయంలో అజాగ్రత్తగా ఉంటే గుండె సమస్యలు రావడం ఖామని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం అవసరం. వేళకు ఇంత కడుపులో పడితే మానిషి శరీరం యాక్టివ్‎గా ఉంటుంది. సమయంలో ఏ మార్పు వచ్చినా ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం కనిపిస్తుంది. ఉదయం తీసుకునే బ్రేక్‌ ఫాస్ట్ దగ్గరి నుంచి రాత్రి తినే డిన్నర్ వరకు మానవ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఉదయం తినే అల్పాహారం ఒక వ్యక్తికి రోజంతా కావల్సినంత ఎనర్జీని అందిస్తుంది. ఇక డిన్నర్ శరీరానికి కావల్సిన పోషకాలను అందిస్తుంటుంది. అయితే వీటికంటూ నిర్ణీత సమయం ఉంటుంది. అయితే బ్రేక్ ఫాస్ట్ సమయానికి తీసుకోకపోతే పెరాలసిస్ రిస్క్ పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల లక్షమంది వ్యక్తులపై జరిపిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. బ్రేక్‌ ఫాస్ట్, డిన్నర్ ఎర్లీగా తినడం వల్ల గుండె జబ్బుల రిస్క్ కూడా తగ్గుతుందట. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో పబ్లిషైన ఈ అధ్యయనంలో 1 లక్ష మందికి పైగా వ్యక్తుల డేటాను 7 సంవత్సరాలుగా పరిశోధకులు సమీక్షించారు. ఈ అధ్యయనంలో గుండెపోటు, స్ట్రోక్‌లతో సహా దాదాపు 2,000 హృదయ సంబంధిత వ్యాధులను గుర్తించారు. బ్రేక్‌ ఫాస్ట్ లేట్ గా తినడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉందని ఈ పరిశోధనలో తేలింది. అల్పాహారం ఆలస్యైన ప్రతి గంట సెరెబ్రోవాస్కులర్ వ్యాధి రిస్క్ నిపెంచుతుందని తేలింది.

రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల స్ట్రోక్ , ట్రాన్సియెంట్ ఇస్కీమిక్ అటాక్ రిస్క్ 28 శాతం పెరుగుతుందని ఈ అధ్యయనంలో తేలింది. ఎందుకంటే రాత్రిపూట డిన్నర్ చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్, రక్తపోటు పెరుగుతుంది. అధిక రక్తపోటు సాధారణంగా సాయంత్రం పడిపోతుంది. ఇది రక్త నాళాలకు ఎక్కువ నష్టం కలిగిస్తుంది. రక్తం గడ్డకట్టడం, హార్ట్ ఎటాక్ రిస్క్‎ని పెంచుతుంది. అయితే ఈ విషయంలో మరింత అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. మొత్తం జనాభాలో 80 శాతం మంది స్ల్రీలల్లో ఈ వ్యాధి రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే పురుషులపై ఇది అంతగా ప్రభావితం చూపదని తెలుస్తోంది. బ్రేక్ ఫాస్ట్ ఆలస్యంగా చేసే పురుషులకు కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే రిస్క్ 11 శాతం ఎక్కువగా ఉందని తేలింది. ఇదిలా ఉంటే రాత్రిపూట ఉపవాసాల వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నట్లు ఈ పరిశోధకులు చెబుతున్నారు. రాత్రి డిన్నర్ చేయకుండా ఉండటం వల్ల ప్రతి గంటకు, స్ట్రోక్ రిస్క్ 7 శాతం వరకు తగ్గుతుందని అధ్యయనంలో గుర్తించారు. అందుకే ఇప్పటికైనా ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి టైంకి తిని హెల్దీగా ఉండండి.


Updated : 2 Jan 2024 7:16 AM GMT
Tags:    
Next Story
Share it
Top