Home > ఆరోగ్యం > Health Tips : బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారా? డేంజర్‌లో ఉన్నట్లే

Health Tips : బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారా? డేంజర్‌లో ఉన్నట్లే

Health Tips : బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారా? డేంజర్‌లో ఉన్నట్లే
X

(Health Tips) ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ ఎవ్వరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు. అయితే చాలా మంది పనిలో పడి తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఉదయం పూట తినకపోతే జరిగే పరిణామాలు వేరు. బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. బ్రేక్‌ఫాస్ట్ అనేది రోజంతా ఒక ఇంధనంలా పనిచేస్తుంది. దానిని నిర్లక్ష్యం చేస్తే ఇక ముప్పు తప్పదు. ఇప్పటి వరకూ మీరు ఆ తప్పు చేస్తుంటే మీరే డేంజర్ జోన్లో ఉన్నట్లే. ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ తినకపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మరి అవేంటో ఒకసారి తెలుసుకుందాం.





బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల శరీరంగా నీరసంగా తయారవుతుంది. ఏ పనిపైనా దృష్టిపెట్టలేరు. శరీర శక్తి బాగా తగ్గిపోతుంది. ఉదయం పూట పోషకాహారం తీసుకోవడం వల్ల మెదడు ఉత్తేజంగా పనిచేస్తుంది. బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే మాత్రం ఏకాగ్రత అనేది బాగా దెబ్బతింటుంది. మతిమరుపు వస్తుంది. అందుకే ఉదయంపూట పోషకాహారం తీసుకోండి. తృణధాన్యాలు, పండ్లు, నట్స్, గింజలు తీసుకోండి. బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే ఆరోగ్యకరమైన కొవ్వులు ఆహారంలో ఉత్పత్తి అవుతాయి.





ఉదయంపూట తినకుండా ఉంటే మీకు రోజంతా ఆకలిగా అనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో అతిగా తినేస్తూ ఉంటారు. దానివల్ల బరువు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. మన శరీరానికి మినరల్స్, ప్రోటీన్స్ వంటి పోషకాలు సమృద్ధిగా అందాలంటే కచ్చితంగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. కొంత మంది తరచూ బ్రేక్‌ఫాస్ట్ మానేస్తుంటారు. అలాంటి వారికి గుండెజబ్బులు, ఊబకాయం, టైప్2 డయాబెటీస్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఉదయంపూట తినని వారికి గుండెపోటు ప్రమాదాలు ఎక్కువగా వస్తాయని వైద్య నిపుణులు తెలిపారు. అంతేకాకుండా ఉదయం పూట తినడం మానేస్తే మానసిక ఉల్లాసం దెబ్బతింటుంది. చిరాకు, నిరాశ వంటివి ఎదురవుతాయి. అందుకే క్రమం తప్పకుండా బ్రేక్‌ఫాస్ట్ చేయడం. ఉదయంపూట తినడం ఎట్టిపరిస్థితుల్లోనూ మానుకోకండి.


Updated : 5 Feb 2024 5:00 PM IST
Tags:    
Next Story
Share it
Top