Home > ఆరోగ్యం > Thyroid Disease : ఉన్నట్లుండి బరువు పెరిగారా? అయితే ఈ వ్యాధి కన్ఫామ్

Thyroid Disease : ఉన్నట్లుండి బరువు పెరిగారా? అయితే ఈ వ్యాధి కన్ఫామ్

Thyroid Disease : ఉన్నట్లుండి బరువు పెరిగారా? అయితే ఈ వ్యాధి కన్ఫామ్
X

థైరాయిడ్ అనేది సీతాకోక చిలుక ఆకారంలో గొంతు దగ్గర ఉండే ఒక ఎండోక్రైన్ గ్లాండ్. ఇది థైరాక్సిన్ అనే థైరాయిడ్ హార్మోన్‌ని రిలీజ్ చేస్తూ శరీరంలో అనేక మెటబాలిక్ ప్రాసెస్‌లని ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ దీర్ఘకాలిక సమస్య. భారత్‎లో ప్రతి పది మందిలో ఒకరి కన్నా ఎక్కువ మంది థైరాయిడ్‏తో బాధపడేవారు ఉన్నారు. ఈ సమస్య మగవారితో పోల్చితే ఆడవారిలో రెట్టింపు కనిపిస్తుంటుంది. గొంతు ముందు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ శరీరంలోని ప్రతి అవయవం మీద ఎఫెక్ట్ చూపుతుంది. ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గితే హైపో థైరాయిడ్ అని, అధికంగా ఉంటే హైపర్ థైరాయిడ్ అని అంటారు. హైపో థైరాయిడ్ సమస్య కన్నా హైపర్ థైరాయిడ్ అయిదు రెట్లు అధికంగా ఉంటుంది. ఉన్నట్లుండి బరువు పెరగడం, నీరసంగా ఉండటం, చలిగా అనిపించడం, స్కిన్ డ్రై అయిపోవడం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడంతో పాటు ఏ పని మీద పెద్దగా దృష్టి సారించలేకపోతున్నా ఒక సారి తప్పనిసరిగా థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

2-3 నెలల్లోనే 10 కిలోల బరువు పెరిగే ఛాన్స్ :

హైపోథైరాయిడిజం వల్ల స్త్రీలలో హార్మోన్ల ఇంబాలెన్స్ ఏర్పడి జుట్టు రాలిపోతుంటుంది. ట్రీట్మెంట్ తీసుకునే వరకు జుట్టు రాలుతూనే ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్స్ లెవెల్స్ కంట్రోల్‎లోకి రాగానే తిరిగి జుట్టు పెరగడం మొదలవుతుంది. థైరాయిడ్ గ్లాండ్ అండర్ యాక్టివిటీ కారణంగా విపరీతమైన అలసట ఉంటుంది. థైరాయిడ్ సమస్య ఉందనడానికి ఇది ఒక సాధారణ లక్షణం. థైరాయిడ్ హార్మోన్‌లోని రుగ్మతలు బాడీ టెంపరేచర్ ని నియంత్రించే సామర్థ్యాన్ని నిలిపివేస్తాయి. ఒకవేళ హైపో థైరాయిడిజం ఉన్నట్లయితే, గతంలో కంటే ఎక్కువగా చలిని ఫీల్ అవుతారు. హైపోథైరాయిడిజంతో మలబద్ధకం ఏర్పడుతుంది. థైరాయిడ్ హార్మోన్ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయిలు గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఆకస్మికంగా బరువు పెరగడం అనేది థైరాయిడ్ గ్రంధి యొక్క అండర్ యాక్టివిటీకి సంబంధించిన ఒక సంకేతం. దాదాపు 2-3 నెలల్లోనే 10 కిలోల బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ సమస్య ఉన్నట్లైతే చర్మంతో పాటు జుట్టు కూడా పొడిబారుతుంది. చర్మానికి ఎంత మాయిశ్చరైజర్ అప్లై చేసినా ఎప్పుడూ పొడిగానే ఉంటుంది. ఇది కండరాలను బలహీనపరుస్తాయి. థైరాయిడ్ హార్మోన్‌లో హెచ్చుతగ్గుల కారణంగా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి. ఏకాగ్రతపైన థైరాయిడ్ గ్రంధి ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు బాగా తెలిసిన విషయాలను కూడా మరచిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్ లక్షణాల్లో గొంతు ప్రాంతంలో అలసట, మెడ ముందు భాగంలో వాపు, కళ్లు తిరగడం, గొంతు బొంగురుపోవడం వంటి లక్షణాలు గాయిటర్‌లో కనిపిస్తాయి. అందుకే మెడ ప్రాంతంలో వాపు గమనించిన వెంటనే థైరాయిడ్ లెవెల్స్‎ను చెక్ చేసుకోవాలి.

మానసిక స్థితిపై ప్రభావం :

హైపర్ థైరాయిడిజం శరీరంలో అవసరమైన దానికంటే ఎక్కువ థైరాయిడ్ హార్మోన్స్‎ను రిలీజ్ చేస్తుంది. థైరాయిడ్ హార్మోన్స్ లెవెల్స్‎లో హెచ్చుతగ్గులు నిద్ర తీరులో మార్పులకు దారితీయవచ్చు. ఒకవేళ రాత్రివేళల్లో సరిగ్గా నిద్రపట్టకపోతే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. బరువులో హెచ్చుతగ్గులు మీ రక్తంలో థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను బట్టి ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ పెరిగితే ఊహించని విధంగా బరువు తగ్గుతారు. థైరాయిడ్ హార్మోన్ మానసిక స్థితిపై ప్రభావాన్ని కలిగిస్తుంది. థైరాయిడ్ లెవెల్స్ పెరగటం వల్ల ఆందోళన, వణుకు ,భయానికి దారితీస్తుంది. థైరాయిడ్ హార్మోన్ల పెరుగుదల శరీరంలో సెన్సిటివిటీని కూడా పెంచుతుంది. హైపర్ థైరాయిడిజం ఉంటే బాధితులు వేడి వాతావరణాన్ని తట్టుకోలేరు. రోజంతా చెమటలు పడుతూ ఇబ్బంది కరంగా ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ పెరగడం వల్ల దృష్టిలోపాలు ఏర్పడతాయి.




Updated : 5 Dec 2023 12:03 PM IST
Tags:    
Next Story
Share it
Top