ప్రయాణంలో వాంతులతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించండి
X
చాలా మందికి ప్రయాణం సమయంలో వికారం, తల తిరగడం కడుపులో తిప్పడం వంటివి జరుగుతుంటాయి. ఈ పరిస్థితి ఏర్పడడానికి కారణం జననేంద్రియాలైన చేవికి, ముక్కుకు కళ్లకు, మెదడుకు వేర్వేరు సంకేతాలను వెళ్ళడం. ఇలాంటి లక్షణాన్ని వైద్య భాషలో మోషన్ సిక్‌నెస్‌గా పిలుస్తారు. ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు నాడి వ్యవస్థ అయోమయానికి గురై వాంతులు రావడానికి కారణమవుతుంది. అస్వస్థత కారణంగా ఏదైనా ట్రిప్‌కు వెళ్ళినప్పుడు కానీ శుభకార్యాలకు వెళ్ళినప్పుడు కాని చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రయాణాల్లో వాంతులు రాకుండా ఉండాలంటే . చిన్న...చిన్న చిట్కాలు పాటిస్తే చాలు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రయాణాల్లో అల్లం ముక్కను నోటిలో పెట్టుకుని నమలాలి.
పుదీనా ఆకులు వాసన పిల్చీడం కానీ.. నమలడం కానీ చేస్తుండాలి. పుదీనా కడుపులో మంట సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఈ అకులను ప్రయాణంలో బ్యాగ్‌లో ఉంచుకోవాలి.
వాంతులు ఆపడానికి నిమ్మకాయ ఉత్తమ మార్గం. నిమ్మకాయను వాసన చూస్తే వాంతులు, తలతిరగడం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ప్రయాణ సమయంలో వాంతులు సమస్య ఉంటే. కాబట్టి తేలికపాటి ఆహారం తీసుకోవాలి.
మన శరీరంలోని వ్యాధులను దూరం చేయడంలో లవంగం ఎంతగానో సహకరిస్తుంది. దీనితో పాటు, బ్లాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల వాంతులు సమస్య నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.
పుల్లగా ఉండే చాక్లెట్లను నోట్లో పెట్టుకుని చప్పరిస్తుండాలి.
బస్సులో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. బయటి గాలి తగిలేలా చూసుకోవడం మంచిది.
ప్రయాణానికి ముందు సిగరెట్లు కానీ ఆల్కహాల్ తాగకూడదు
ప్రయాణ సమయంలో నిద్ర పోవడం మంచిది
ప్రయాణానికి ముందు వాంతి రాకుండా వైద్యులు ఇచ్చే మాత్రలు వేసుకోవడం మంచిది.