Home > ఆరోగ్యం > ADI PEG20 : గుడ్ న్యూస్.. క్యాన్సర్కు కొత్త మందు కనిపెట్టిన సైంటిస్టులు

ADI PEG20 : గుడ్ న్యూస్.. క్యాన్సర్కు కొత్త మందు కనిపెట్టిన సైంటిస్టులు

ADI PEG20 : గుడ్ న్యూస్.. క్యాన్సర్కు కొత్త మందు కనిపెట్టిన సైంటిస్టులు
X

క్యాన్సర్ పేషెంట్లకు యూకే సైంటిస్టులు గుడ్ న్యూస్ చెప్పారు. క్యాన్సర్లో అత్యంత మొండి రకమైన మెసోథెలియోమా ట్రీట్మెంట్లో పురోగతి సాధించారు. మెసోథెలియోమా ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన, వేగంగా వ్యాపించే చికత్సకు లొంగని క్యాన్సర్. లండన్లోని క్వీన్ మేరీ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్లు కనిపెట్టిన ఔషధం మెసోథెలియోమా వచ్చిన పేషెంట్ల జీవితకాలాన్ని పెంచినట్లు ది గార్డియన్ ప్రకటించింది. మెసోథెలియోమో క్యాన్సర్ వచ్చిన వారి సగటు జీవితకాలం మూడు ఏండ్లు కాగా కొత్త ఔషధం వారి జీవితకాలాన్ని నాలుగు రెట్లు పెంచినట్లు సైంటిస్టులు ప్రకటించారు. ఈ ఔషధం క్యాన్సర్ కణితుల్లోని కణాలకు అవసరమైన ఆహారం సరఫరా కాకుండా అడ్డుకొంటుందని సైంటిస్టులు చెబుతున్నారు.

బతకడం కష్టమే

మెసోథెలియోమా క్యాన్సర్ ఊపిరితిత్తులకు వస్తుంది. ఇది ఎక్కువగా ఆస్బెస్టాస్ తయారీ పరిశ్రమల్లో పనిచేసే వారికి వస్తుంది. ఈ క్యాన్సర్ సోకిన వారు బతికి బట్టకట్టడం కష్టమే. ప్రపంచవ్యాప్తంగా ఏటా వేల మంది ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఒక్క యూకేలోనే ఏడాదిలో 2,700 కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో లండన్లోని క్వీన్ మేరీ యూనివర్సిటీ సైంటిస్టులు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, ఇటలీ, తైవాన్ కు చెందిన మెసోథెలియోమా పేషంట్లకు కొత్త మెడిసిన్ ఇచ్చి అధ్యయనం నిర్వహించారు.

రెండేళ్ల పాటు అధ్యయనం

ట్రయల్ కోసం ఎంపిక చేసిన పేషెంట్లకు ప్రతి 3వారాలకు ఒకసారి చొప్పున ఆరుసార్లు కీమోథెరపీ ఇచ్చారు. రెండేళ్ల పాటు సాగిన అధ్యయనంలో పేషెంట్లలో సగం మందికి కీమోథెరపీతో పాటు కొత్త ఔషధం ADI-PEG20 ఇచ్చారు. మిలిగిన సగం మందికి ప్లాసెబో, కీమోథెరపీతో ట్రీట్మెంట్ కొనసాగించారు. పరిశోధనలో పాల్గొన్న రోగుల్లో ప్లూరల్ మెసోథెలియోమా చివరి దశలో ఉన్న 249 మంది రోగులు సైతం ఉన్నారు. వారిలో ఈ క్యాన్సర్ ఊపిరితిత్తుల పొరను ప్రభావితం చేసింది. వీరి సగటు వయస్సు 70 ఏండ్లు.

పెరిగిన సగటు జీవితకాలం

ATOMIC-meso ట్రయల్ను 2017 - 2021 మధ్య కాలంలో ఐదు దేశాల్లోని 43 కేంద్రాలలో నిర్వహించారు. రీసెర్చ్లో పాల్గొన్న రోగులను కనీసం ఒక ఏడాది పాటు అబ్జర్వేషన్లో ఉంచారు. అందులో ప్లేసిబో, కీమోథెరపీ తీసుకున్న రోగులు 7.7 నెలలు ఎక్కువ బతకగా.. పెగార్గిమినేస్, కీమోథెరపీ ఇచ్చిన పేషెంట్లు సగటున 9.3 నెలలు జీవించారు. ప్లేసిబో, కీమోథెరపీ చికిత్స అందించిన రోగుల జీవితకాలంతో పోలిస్తే.. పెగార్గిమినేస్-కెమోథెరపీతో చికిత్స ఇచ్చిన రోగుల్లో వ్యాధి పెరగకపోవడంతో వారి జీవితకాలం 5.6 నెలల నుంచి 6.2 నెలలకు పెరిగిందని పరిశోధకులు గుర్తించారు.

ఎలా పనిచేస్తుందంటే..

లండన్ సైంటిస్టులు రూపొందించిన కొత్త ఔషధం క్యాన్సర్ కణాల మనుగడకు అవసమైన ఆహారం అందకుండా అడ్డుకోవడం ద్వారా పేషెంట్ల జీవితకాలం పెంచుతుంది. ఈ మెడిసిన్ రోగి రక్తంలో అర్జినైన్ స్థాయిలను తగ్గిస్తుంది. క్యాన్సర్ కణాలు సొంతంగా అర్జినైన్ను తయారు చేసుకోలేవు. దీంతో క్యాన్సర్ కణుతులు పెరుగుదల ఆగిపోతుంది. ఫలితంగా మెసోథెలియోమా క్యాన్సర్ ఇంకా పెరగకుండా ఇతర భాగాలకు వ్యాప్తించకుండా ఆగిపోతుంది.







Updated : 16 Feb 2024 1:34 PM IST
Tags:    
Next Story
Share it
Top