Home > ఆరోగ్యం > నీ గుండె ఆరోగ్యంగా ఉందా? తెలుసుకోండి ఇలా...

నీ గుండె ఆరోగ్యంగా ఉందా? తెలుసుకోండి ఇలా...

నీ గుండె ఆరోగ్యంగా ఉందా? తెలుసుకోండి ఇలా...
X

మొన్నామధ్య గణేశ్ మండపం దగ్గర డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు కుప్పకూలిపోయాడు. అంతకు ముందు ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ ఆట మధ్యలోనే గుండె ఆగిపోవడంతో ప్రాణాలను విడిచాడు. ఈ రెండే కాదు ఇలాంటి సంఘటనలు నిత్యం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అధికమవుతున్నాయి. హార్ట్ ఎటాక్‎తో ఎంతో మంది యువకుల జీవితాలకు ఎండ్ కార్డ్ పడుతోంది. లైఫ్‎లో ఫెయిల్ అయినా, కెరీర్‎లో వెనుకబడినా , ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా...సమస్య ఏదైనా కానీ..దాని ఎఫెక్ట్ మాత్రం గుప్పెడంత గుండెకే తగులుతోంది. హృదయం ఆరోగ్యంగా ఉంటేనే మనిషి మనుగడ సాధ్యం. ఇది జగమెరిగిన సత్యం. హార్ట్ ఎటాక్ బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. వయసుతో సంబంధంలేకుండా గుండె జబ్బులు అందరినీ అటాక్ చేస్తున్నాయి. అందుకే గుండె సంబంధిత వ్యాధులపై వాటి నివారణ చర్యలపై అవేర్‎నెస్ పెంచేందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డే జరుపుకుంటున్నాము. "Use Heart, Know Heart." అనే థీమ్‎తో ఈ సంవత్సరం హార్ట్ డే ను జరుపుకుంటున్నాము.

ఆల్కహాల్, స్మోకింగ్ వల్ల గుండె జబ్బులు:





దేశవ్యాప్తంగా గుండె జబ్బులకు గురవుతున్న వారిలో యువకులు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. గుండె జబ్బులకు ప్రధానంగా ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవటం, ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వడం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఆల్కహాల్, స్మోకింగ్ వల్ల కూడా ఈ మధ్యకాలంలో గుండె జబ్బులు పెరిగిపోతున్నాయి. నిద్రలో ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు పడేవారు, గురక ఎక్కువగా పెట్టేవారు హార్ట్ ఎటాక్‎కు గురవుతున్నారు. చిన్నపిల్లల్లోనూ జన్యుపరమైన సమస్యల వల్ల గుండె జబ్బులు వస్తున్నాయి. బ్లడ్ వెస్సెల్స్‎లో కనీసం 50 శాతం బ్లడ్ సరఫరా కాకపోవటం కూడా గుండె ఆగిపోయేందుకు కారణం అవుతుంది.

అధిక రక్తపోటు గుండెకు మంచిది కాదు :





ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు నిపుణులు. హార్ట్ కి సంబంధించిన సమస్యలు వచ్చాక ట్రీట్మెంట్ మొదలుపెట్టేకంటే ముందే హృదయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తమ హృదయాన్ని గురించి తెలుసుకోవాలి. ఈ సంవత్సరం వరల్డ్ హార్ట్ డే థీమ్ కూడా అదే. కొన్ని సైన్ల ద్వారా మీ హార్ట్ హెల్దీగా ఉందో లేదో తెలుసుకోవచ్చు. అధిక రక్తపోటుతో గుండె ఆగిపోయే ప్రమాదం అధికం. అందుకే బీపీ లెవెల్స్ ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండటం వల్ల హార్ట్ ఎటాక్ రిస్క్ ఫ్యాక్టర్ నుంచి తప్పించుకోవచ్చు. అధిక రక్తపోటే కాదు... లో బీపీ కూడా గుండెకు ఏమాత్రం మంచిది కాదు.

గుండె ఆరోగ్యం తెలుసుకోండి ఇలా :





మీ పల్స్.. శరీరంలోని వివిధ భాగాలలో బ్లడ్ ఫ్లో , బీపీ స్ట్రెంత్‎ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. వేగవంతమైనా, లేదా నెమ్మదిగా ఉన్న హృదయ స్పందన మీ గుండె ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. బ్లడ్ రిపోర్ట్స్..గుండె ఆరోగ్యంతో ముడిపడి ఉన్న సోడియం, పొటాషియం, క్రియేటినిన్ లెవెల్స్‎ను తెలుసుకోవడానికి సహాయపడుతుంది.పేలవమైన కొలెస్ట్రాల్ లెవెల్స్ మీ ఆర్టరీస్‎ని బ్లాక్ చేసి హార్ట్ ఎటాక్ రిస్క్‎ను పెంచుతాయి. అందువల్ల, ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను మెయిన్‎టైన్ చేయడం అనేది గుండెకు అత్యంత కీలకం. సాధారణ బ్లడ్ టెస్టు మీ కొలెస్ట్రాల్ లెవెల్స్‎ను తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

మరి మీ హృదయం ఆరోగ్యంగా ఉన్నట్లేనా? లేకపోతే కనుక వరల్డ్ హార్ట్ డే సందర్భంగా హార్ట్ అటాక్ రిస్క్ ఫ్యాక్టర్స్‎ను కంట్రోల్ చేయాలనే ప్లెడ్జ్‎ను ఇప్పుడే తీసుకోండి. ఒత్తిడిని దూరం చేసే మెడిటేషన్, వ్యాయామం, సమయానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటి చిన్నపాటి జాగ్రత్తలతో హార్ట్ అటాక్ నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.



Updated : 29 Sept 2023 10:22 AM IST
Tags:    
Next Story
Share it
Top