భయపెడుతున్న వైరల్ ఫీవర్స్
X
ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. వైరల్్ ఫీవర్స్ తో జనాలు సతమతమవుతున్నారు. ఎక్కడ చూసినా జ్వరాలు, డెంగ్యూ, డయేరియా లతో బాధపడుతున్న జనాలే. తెలంగాణలో వైరల్ ఫీవర్స్ బాధ ఎక్కువైంది. జనాలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు.
రోజుకో రకంగా ఉంటున్న వాతావరణ పరిస్థితులు, అపరిశుభ్రాలతో ప్రజలు బాధలు పడుతున్నారు. పల్లె, నగరం అని తేడా లేకుండా అన్ని చోట్లా దోమలు పెరిగిపోయాయి. వీటివల్ల ప్రజల ఆరోగ్యం పాడవుతోంది. డయేరియా, వైరల్ ఫీవర్లతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఇవి కాకుండా దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులతో భాదపడుతున్నవారు ఎక్కువే ఉన్నారు. వైరల్ ఫీవర్స్ లో డెంగీ లాంటి కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇవి కూడా జనాలను మరింత భయపెడుతున్నాయి. డెంగీ జ్వరంలో బ్లడ్ లో ప్లేటెలెట్స్ పడిపోయి హాస్పటల్స్ లో జాయిన్ అవుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. చాలా మందికి రూమ్స్ దొరకక ఇబ్బందులు పడుతున్నారు.
ఈ విషయంలో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తం అయింది. విష జ్వరాలు, వ్యాధుల మీద ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటి పరిసరాల్లో పరిశ్రుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రల్లో ఎల్లవేళలా డాక్టర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మందులు కూడా ఎప్పుడూ దొరికేలా ఏర్పాట్లు చేస్తున్నారు.