Home > ఆరోగ్యం > సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి..? దాన్ని ఎలా నివారించవచ్చు..

సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి..? దాన్ని ఎలా నివారించవచ్చు..

సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి..? దాన్ని ఎలా నివారించవచ్చు..
X

బాలీవుడ్ నటి పూనమ్ పాండే చనిపోయారు. కొంతకాలంగా సర్వైకల్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె కన్నుమూశారు. దీంతో ప్రస్తుతం సర్వైకల్ క్యాన్సర్ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి..? దాని నుంచి ఎలా రక్షణ పొందవచ్చు అనే విషయాలు తెలుసుకుందాం.

గర్భాశయ ముఖద్వారం వద్ద వచ్చే క్యాన్సర్‌ను సర్వైకల్ క్యాన్సర్ అని అంటారు. గర్భాశయానికి కింది భాగంలో ఉండే సన్నటి ప్రదేశమే సర్విక్స్. ఇది గర్భాశయాన్ని యోనితో కలుపుతుంది. మిగతా క్యాన్సర్లతో పోలిస్తే సర్వైకల్ క్యాన్సర్‌ను నివారణ అత్యంత సులభం. స్క్రీనింగ్‌ ద్వారా ఈ క్యాన్సర్ గుర్తించొచ్చు. ఎంత ముందుగా గుర్తిస్తే ట్రీట్ మెంట్ అంత తేలిక అవుతుంది. మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్‌ తర్వాత అత్యధికంగా ఎదుర్కొంటున్న సమస్య గర్భాశయ క్యాన్సర్‌. ఇది హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ వల్ల వస్తుంది. ఈ వైరస్‌ను సకాలంలో గుర్తించి నివారించకపోతే అది గర్భాశయ క్యాన్సర్‌కు దారి తీస్తుంది. స్క్రీనింగ్ టెస్ట్, HPV వ్యాక్సిన్‌ తీసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్‌ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు.

సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు

ఇక సర్వైకల్ క్యాన్సర్ లక్షణాల విషయానికొస్తే.. పీరియడ్స్‌ సమయంలో అధికంగా రక్తస్రావం కావడం, లైంగిక చర్యలో పాల్గొన్న తర్వాత రక్తస్రావం జరుగుతుంది. పొత్తి కడుపులో నొప్పి, లైంగిక చర్యలో పాల్గొన్నాక యోని నొప్పి, మంట రావడం, దుర్వాసనతో కూడిన వెజైనల్ డిశ్చార్డ్, పదే పదే మూత్రానికి వెళ్లాల్సి రావడం, యూరిన్ సమయంలో నొప్పిగా అనిపిస్తుంది. కడుపు ఉబ్బరం, అలసట, నీరసంగా అనిపించినా విరేచనాలు అవుతున్నా సర్వైకల్‌ క్యాన్సర్‌గా అనుమానించాలి. వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.

సర్వైకల్ క్యాన్సర్ నివారణ మార్గాలు

సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్‌స్మియర్‌ అనే టెస్ట్ చేస్తారు. 21 ఏండ్లు నిండిన మహిళలతో పాటు, శృంగారంలో పాల్గొనడం ప్రారంభించి మూడేళ్లు దాటిన ప్రతి మహిళా క్రమం తప్పకుండా ఈ పరీక్ష చేయించుకోవాలి. నిజానికి సర్వైకల్ క్యాన్సర్ తొలి దశలో ఎలాంటి లక్షణాలు చూపించదు. శరీరంలోని ఏదైనా వైరస్ లేదా బ్యాక్టీరియా ప్రవేశిస్తే దాన్ని తట్టుకునేందుకు యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతుంటాయి. కానీ హెచ్‌పీవీ వైరస్ సోకినప్పుడు శరీరం ఎలాంటి యాంటీబాడీస్‌ను తయారు చేయదు. సర్వైకల్ క్యాన్సర్లో నాలుగు దశలుంటాయి. ఒక్కో దశకు ఒక్కో రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ప్రస్తుతం వైద్యరంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా ఈ క్యాన్సర్ నుంచి సులభంగా బయటపడవచ్చు. హెచ్ పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఈ వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది. వీటితో పాటు స్మోకింగ్ మానేయడం, సమతులాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఇన్ఫెక్షన్లను తగ్గించే బలమైన రోగనిరోధకత సాధించడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ నుంచి కాపాడుకోవచ్చు.


Updated : 2 Feb 2024 10:01 AM GMT
Tags:    
Next Story
Share it
Top