Haemophilia : మీ పిల్లలకు ముక్కలో నుండి రక్తం కారుతుందా? అయితే జాగ్రత్త!
X
హిమోఫిలియా అనేది చాలా మందిని వేదించే సమస్య, హిమోఫిలియా కారణంగా శరీరంలో రక్తం గడ్డకట్టే ప్రక్రియ మందగిస్తుంది. దీని వల్ల తీవ్ర రక్త స్త్రావం అవుతుంది. హిమోఫిలియాలో అత్యంత సాధారణ లక్షణం అనియంత్రిత రక్తస్రావం.
హీమోఫీలియాతో బాధపడే పిల్లల్లో ఏదైనా గాయం అయినప్పుడు చాలా సేపు రక్తస్రావం అవుతూనే ఉంటుంది. పిల్లలు ఆడుకునే సమయంలో కాళ్లు, చేతులపై ఏదైనా గాయం అయినప్పుడు రక్తస్రావం ఆగదు, ఇది ఈ వ్యాధిలో కనిపించే సాధారణ లక్షణం. రక్తం గడ్డకట్టే కారకాలు లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. గడ్డకట్టే కారకం అనేది ఒక రకమైన ప్రోటీన్, ఇది రక్తస్రావం నియంత్రించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ఈ వ్యాధిలో హీమోఫిలియా A, B వంటి అనేక రకాలు ఉన్నాయి.
హిమోఫిలియా బాధపడుతున్న వారిలో రక్తస్రావం ఆగదు. దీంతో ఈ వ్యాధి ప్రాణంతాకంగా మారింది. హిమోఫిలియా బాధపడే రోగుల సంఖ్యలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. భారత్‌లో దాదాపు 1.3 లక్షల మంది హిమోఫిలియా రోగులు ఉన్నారు. హిమోఫిలియా అంటే ఏమిటి..? దీని లక్షణాలు ఏమిటో? ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
అబ్బాయిలలో ఎక్కువగా హీమోఫీలియా సమస్య కనిపిస్తుంది. సాదరణంగా X క్రోమోజోమ్ ఫ్యాక్టర్ ద్వారా మగ పిండం తయారవుతుంది. క్రోమోజోమ్ లోపం కారణంగా పుట్టబోయే మగ శిశువులలో హీమోఫీలియా ఏర్పడుతుంది.
పిల్లలలో హిమోఫిలియా లక్షణాలు
- కండరాలు, కీళ్ల నుంచి రక్తస్రావం
- అంతర్గత రక్తస్రావం
- శస్త్రచికిత్స తర్వాత సుదీర్ఘ రక్తస్రావం
- తరచుగా ముక్కు నుండి రక్తస్రావం
- చిగుళ్ల నుంచి నిరంతర రక్తస్రావం
- హిమోఫిలియా ఉన్న వ్యక్తులు కూడా జీర్ణశయాంతర రక్తస్రావం కలిగి ఉండవచ్చు, దీని ఫలితంగా మలం లేదా మూత్రంలో రక్తం ఏర్పడవచ్చు
కారణం-
-కీళ్ల నొప్పి
- కీళ్ల వాపు
- కీళ్లలో దృఢత్వం
- పిల్లల నడవడంలో ఇబ్బంది
-పిల్లలు వాంతులు చేసుకుంటే రక్తస్రావం అవుతుంది
- మెదడులో రక్తస్రావం
- మూర్ఛ సమస్య
- తలనొప్పి
ఈ సంకేతాల ద్వారా పిల్లలకి ఈ వ్యాధి ఉందా లేదా అని మీరు తెలుసుకోవచ్చు. అయితే, దీనికి జన్యు చరిత్ర వంటి అనేక ఇతర కారణాలు ఉండవచ్చు. గర్భిణీ తల్లికి ఈ సమస్య ఉంటే పుట్టబోయే బిడ్డకు కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
ఎలా చికిత్స చేయాలి?
-కొన్నిసార్లు మందులతో ఈ రక్తస్రావం ఆగకపోతే సర్జరీ కూడా చేయాల్సి రావచ్చు.
-కీళ్లలో రక్తస్రావం సమస్య ఉంటే శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది. కీళ్లలో రక్తస్రావం సమస్య నుండి ఉపశమనం పొందడానికి, భౌతిక చికిత్స లేదా వ్యాయామం కూడా తీసుకోవచ్చు.
.- గడ్డకట్టే కారకాల స్థాయిలను కొలవడానికి రక్త పరీక్షలు చేస్తారు.
-హీమోఫిలియా చికిత్సకు ఉత్తమ మార్గం గడ్డకట్టే కారకాన్ని భర్తీ చేయడం, తద్వారా రక్తం స్త్రావం జరగకుండా ఉంటుంది
-దీనితో బాధపడేవారు విటమిన్ బి12, విటమిన్ బి6 ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.