WHO : డబ్ల్యూహెచ్ఓ కీలక సర్వే..అధిక ఉప్పు తిని కోట్ల మంది మృతి!
X
చాలా మంది ఆహారాల్లో అధిక ఉప్పును వినియోగిస్తుంటారు. దానివల్ల వారు అనేక అనారోగ్య సమస్య బారిన పడుతుంటారు. అయితే ఉప్పు ఎక్కువగా తినడం వల్ల ప్రాణాంతకంగా మారుతుందని చాలా మందికి తెలియదు. ఈ విషయం తెలియక ఏటా చాలా మంది మరణిస్తుంటారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ సర్వే నిర్వహించింది. సర్వేలో షాకింగ్ విషయాలు తెలిశాయి. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల ప్రతి ఏటా 1,89 మిలియన్ల మంది మరణిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అంటే 15.7 కోట్ల మందికి పైగా అధికంగా ఉప్పు తిని మరణిస్తున్నట్లు చెప్పింది.
ఉప్పును అధికంగా తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. కొంతమంది తమ ఆహారంలో ఉప్పు కలిపి తినడం వల్ల వారికి అది విషంగా మారుతుంది. అంతేకాకుండా హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. బీపీ ఎక్కువై ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉప్పులో సోడియం ఉంటుంది. ఇది అధిక మొత్తంలో మన శరీరంలోకి చేరితే రక్త ప్రసరణ సక్రమంగా సాగదని, హైబీపీ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
చాలా మంది కేవలం ఆహారం మాత్రమే కాకుండా ఫాస్ట్ ఫుడ్స్, చిప్స్ వంటివి తింటూ ఉంటారు. అందులో అధికంగా ఉప్పును వాడుతుంటారు. అటువంటి ఆహారాలను తీసుకుంటుంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. శరీరంలో వేడి కూడా పెరిగి ఇబ్బందిని కలిగిస్తుంది. అందుకే ఉప్పును మితంగానే తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజులో 5 గ్రాముల ఉప్పు మాత్రమే తినాలని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తోంది.