Chicken Price: హైదరాబాద్‌లో కిలో చికెన్@రూ.320
హైదరాబాద్‌లో కిలో చికెన్@రూ.320
X
కోడి మాంసంతో భోజనాన్ని లొట్టలేసుకొని ఆరగించే మాంసాహార ప్రియులకు చికెన్ ధరలు మింగుడుపడటం లేదు. ప్రస్తుతం కోడి ధరలు మరింత పెరిగాయి. ఎండలు మండిపోతుండటంతో చికెన్ తినే వారి సంఖ్య తగ్గుతుంది, చికెన్ అంతగా డిమాండ్ ఉండదులే అనుకుంటే పొరపాటే. రాష్ట్రంలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత రెండు వారాల్లోనే రూ.100 ధర పెరగడంతో వినియోగదారులు అవాక్కవుతున్నారు. ఏప్రిల్ లో చికెన్ ధర రూ.150 ఉండగా అది ఇప్పుడు డబుల్ అయింది.ఆదివారమొస్తే చాలు గ్రేటర్‌లో 8లక్షల నుంచి 12లక్షల కిలోలు, సాధారణ రోజుల్లో 5లక్షల నుంచి 7లక్షల కిలోల చికెన్ అమ్ముడయ్యేది. తాజాగా ధరల పెరుగుదలతో విక్రయాలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. ఏప్రిల్‌లో చికెన్ ధర రూ.150 ఉండగా ప్రస్తుతం రెట్టింపయ్యింది. ప్రస్తుతం లైవ్ కోడి ధర రూ.195, చర్మంతో రూ.290, చర్మం లేకుండా రూ.320కి చేరింది. రవాణా ఛార్జీలు, కోళ్లదాణా ఖర్చులు పెరగడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.
ఇక ఇంటికి బంధువులు వస్తే చికెన్ కొనాలంటే రూ. 1000 దాకా ఖర్చు చేయాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. వేసవిలో విపరీతమైన ఎండలకు బయటకు వెళ్లాలంటేనే మనుషులు కూడా భయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజు దాదాపు 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కోళ్లు ఎండ వేడికి ప్రాణాలు వదులుతున్నాయి. కాని ధరలకు మాత్రం రెక్కలు వచ్చి పైపైకి పెరుగుతున్నాయి.