Home > హైదరాబాద్ > రేపే చేప ప్రసాదం పంపిణీ

రేపే చేప ప్రసాదం పంపిణీ

రేపే చేప ప్రసాదం పంపిణీ
X

మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జబిషన్ గ్రౌండ్స్ వేదికగా జూన్ 9 శుక్రవారం రోజున బత్తిని కుటుంబీకులు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఉదయం 7 గంటల నుంచే చేప మందు ప్రసాదం పంపిణీ ప్రారంభమవుతుంది. పెద్ద ఎత్తున ఆస్తమా వ్యాధిగ్రస్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్ర అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఉబ్బస వ్యాధి గ్రస్తులు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‎కు చేరుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ ఆదేశాల మేరకు అధికారులు ప్రత్యేక చర్యల తీసుకుంటున్నారు.



ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు :

ఏటా మృగశిర కార్తె రోజు జరిగే ఈ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి లక్షలాది మంది ప్రజలు తరలివస్తారు. తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు, పక్క రాష్ట్రాల నుంచి ప్రజలు నాంపల్లి గ్రౌండ్స్‎కు చేరుకుంటారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండి మరీ ఏర్పాట్లను సమీక్షిస్తోంది. ఇప్పటికీ అన్ని ప్రభుత్వ శాఖలు ఏర్పాట్లలో తలమునకలయ్యాయి. ఇప్పటికే ఆర్‌ అండ్‌ బీ అధికారులు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‎లో షెడ్స్‌, ఫ్లడ్‌ లైట్లు, భారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఇటు ఆర్టీసీ అధికారులు ఎగ్జిబిషన్ గ్రౌండ్‎కు వెళ్లేందుకు ప్రత్యేకంగా బస్సులను నడపనున్నారు. శానిటేషన్‌, మరుగుదొడ్లను ఏర్పాటు చేయడంలె జీహెచ్‌ఎంసీ అధికారులు నిమగ్నమయ్యారు. జలమండలి అధికారులు మంచినీటిని సరఫరా చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ డిపార్ట్‎మెంట్‎తో సహా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు చేప ప్రసాదం పంపిణీని సక్సెస్ చేసేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‎కు ప్రత్యేక బస్సు సర్వీసులు :

ప్రయాణికుల కోసం జూన్ 8 నుంచి 10వ తారీఖు వరకు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపనుంది. రద్దీ బట్టీ బస్సు స్టాపుల్లో బస్సులను ఏర్పాటు చేశారు. నగరంలోని సికింద్రాబాద్‌ స్టేషన్‌, కాచిగూడ రైల్వే స్టేషన్‌, జేబీఎస్‌, ఎంజీబీఎస్‌, ఈసీఐఎల్‌ క్రాస్ రోడ్స్, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు దగ్గర దాదాపు 50 బస్సులను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మేజర్ స్టాపులతో పాటు మరో 14 ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ వరకు 80 బస్సులను నడపనున్నారు. తెలిపారు.



ట్రాఫిక్‌ ఆంక్షలు :

నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. విభిన్న ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉండటంతో రద్దీని బట్టి, ట్రాఫిక్‌ మళ్లింపు, నిలిపివేతలు చేపట్టనున్నారు. వీలైనంత వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. MJమార్కెట్‌ నుంచి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ వైపు వచ్చే వారు అబిడ్స్‌ జీపీఓ- నాంపల్లి స్టేషన్‌ రోడ్డులోకి వెళ్లాని సూచిస్తున్నారు. ఎంజే బ్రిడ్జి, బేగంబజార్‌ ఛత్రి నుంచి నాంపల్లి వైపు వెళ్లే వాహనదారులను అలస్క టవర్స్‌ వద్ద దారుసలాం, ఏక్‌ మినార్‌ వైపు మళ్లించనున్నారు. పీసీఆర్‌ జంక్షన్‌ నుంచి నాంపల్లి వైపు వచ్చే ప్రయాణికులు ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌, బీజీఆర్‌ విగ్రహం వైపు దారి మళ్లిస్తారు. నాంపల్లి నుంచి కార్లలో వచ్చే ప్రయాణికులు తమ కార్లను గృహకల్ప, గగన్‌ విహార్‌, చంద్ర విహార్‌ దగ్గర పార్కు చేయాల్సి ఉంటుంది. అనంతరం వారు అజంతా గేట్‌(2) నుంచి ప్రాంగనంలోకి వెళ్లాలి. వీఐపీ కారు పాస్‌ ఉన్న వారు మాత్రం ఎంజే మార్కెట్‌ నుంచి గాంధీ భవన్‌ వరకు రావాల్సి ఉంటుంది. ఎనాంపల్లి నుంచి వచ్చే వెహికిల్స్ గాంధీ భవన్‌ దగ్గర యూటర్న్‌ తీసుకకోవాలి. గేట్‌-1 ద్వారా లోపలికి వెళ్లాలి.

Updated : 8 Jun 2023 9:16 AM GMT
Tags:    
Next Story
Share it
Top