Home > హైదరాబాద్ > ప్లాస్టిక్ ఇస్తే పెట్రోల్ ఫ్రీ.. మన హైదరాబాద్‌లోనే

ప్లాస్టిక్ ఇస్తే పెట్రోల్ ఫ్రీ.. మన హైదరాబాద్‌లోనే

హైదరాబాద్‌లోని ఈ బంకుల్లో పెట్రోల్ ఫ్రీ

ప్లాస్టిక్ ఇస్తే పెట్రోల్ ఫ్రీ.. మన హైదరాబాద్‌లోనే
X


దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాలు తీవ్రస్థాయిలో పెరిగిపోతున్నాయి. దీనికి తగ్గించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశంలో 2030 నాటికి సుమారు 390 మిలియన్ టన్నులు, 2050 నాటికి 540 టన్నులుకు పైగా ప్లాస్టిక్ వేస్టేజ్ ఏర్పడుతుందని అంచనా. అయితే దీనిని తగ్గించడం కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (Indian Oil Corporation) కంపెనీ తన వంతు బాధ్యతగా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ హైదరాబాద్ (Hyderabadd) నగరం వరకే పరిమితం అని వివరించింది. ఇంతకీ ఆఫర్ ఏంటంటే.. చిత్తు కాగితాలు, పనికిరాని అట్టపెట్టెలు, పాడైపోయిన కేబుల్ వైర్లు, మొబైళ్లు, ల్యాప్ టాప్‌లు వంటి వేస్ట్ తీసుకునివచ్చి పెట్రోల్ ఉచితంగా పొందవచ్చు. పర్యావరణాన్ని కాపాడేందుకు తాము ఈ ఆఫర్ (Offer) అమలు చేస్తున్నామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. అందుకే ప్లాస్టిక్ వేస్ట్ స్వీకరించి పెట్రోల్ ఫ్రీగా అందిస్తున్నామని పేర్కొంది.

హైదరాబాద్‌ నగరంలో ఎంపిక చేసిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల్లో ప్లాస్టిక్ వేస్ట్ తీసుకుని వస్తే పెట్రోల్ ఉచితంగా పొందవచ్చని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (Indian Oil Corporation) ప్రకటించింది. ఈ మేరకు పెట్రోల్ బంకుల వివరాలను కూడా వెల్లడించింది. హైటెక్ సిటీ సమీపంలోని లెమన్ ట్రీ ఎదురుగా ఉన్న ఇండియన్ ఆయిల్ బంకులో, ఐకియా స్టోర్ సమీపంలోని బంకులో, జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లోని బంకులో, మియాపూర్ సమీపంలోని సైబర్ ఫిల్లింగ్ స్టేషన్‌లో, బేగం పేట్ రోడ్‌లోని ప్రకాష్ నగర్ వద్ద ఉన్న బంకుల్లో ఈ విధానం అమలు చేస్తున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వివరించింది. ఈ బంకుల్లో చెత్త బరువును చూసి దానికి తగ్గట్టు పెట్రోల్ పోస్తారు. ఉదాహరణకు 2.8 కిలోల చెత్త ఉంటే 380 ఎంఎల్ పెట్రోల్ ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా రిజిస్టర్ అయిన వారికి అయితే అదనంగా 100 ఎంఎల్ ఉచితంగా ఇస్తున్నారు.

అయితే చెత్తలో ప్లాస్టిక్ వేస్ట్, పేపర్, కార్డు బోర్డు, నోట్ బుక్స్, పాడైపోయిన మొబైల్స్, ల్యాప్ టాప్స్, కేబుల్స్, నెట్వర్క్ ఎక్విప్ మెంట్ వంటి వాటిని మాత్రమే తీసుకుంటామని ఐవోసీ తెలిపింది. పరుపులు, బ్యాటరీలు, పెద్ద సైజ్ ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇంట్లో వాడే ప్రమాదకర వ్యర్థాలు, బట్టలు వంటి వాటిని తీసుకోబోమని స్పష్టం చేసింది. మీరు కనుక ఉచితంగా పెట్రోల్ పొందాలనుకుంటే ఇంట్లో పడున్న ప్లాస్టిక్ వ్యర్థాలను, నోట్ బుక్స్ ని.. పనిచేయని మొబైల్స్, ల్యాప్ టాప్స్ వంటివి తీసుకెళ్లండి. పెట్రోల్ ఫ్రీగా పొందండి.


Updated : 7 Aug 2023 5:06 AM GMT
Tags:    
Next Story
Share it
Top