Home > హైదరాబాద్ > రివ్యూలు పెట్టి 20 లక్షలు పోగొట్టుకున్న హైదరాబాద్ డాక్టర్

రివ్యూలు పెట్టి 20 లక్షలు పోగొట్టుకున్న హైదరాబాద్ డాక్టర్

రివ్యూలు పెట్టి 20 లక్షలు పోగొట్టుకున్న హైదరాబాద్ డాక్టర్
X

‘‘ఇంట్లో ఖాళీగా ఉన్నారా? పార్ట్ టైమ్ జాబ్ కావాలా? ఇంట్లోనే ఉండి శ్రమలేకుండా రోజుకు రూ. 1000 నుంచి రూ. 5000 వేలు సంపాదించండి.. మేం ఇచ్చే టాస్కులు పూర్తి చేస్తే మీ అకౌంట్లో డబ్బులు వేస్తాం..’’ ఇలాంటి మెసేజీలను మీరు చాలా చూసే ఉంటారు. మోసం గురూ అని కొట్టిపడేసి ఉంటారు. అయితే వీటిపై అవగాహన లేని కొందరు నిజమేనని నమ్మి మోసపోతున్నారు. కష్టార్జితాన్ని దొంగలపాలు చేస్తున్నారు. అంతగా చదువుకోనివాళ్లే కాదు, పెద్దపెద్ద చదువులు చదువుకున్న వాళ్లు కూడా సైబర్ మోసగాళ్లను నమ్మి దారుణంగా మోసపోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్ ఇలాంటి మాయలో పడి ఏకంగా రూ. 20 లక్షలు పోగొట్టుకున్నాడు. తన డబ్బులు తనకివ్వమని మొత్తుకున్నా ఫలితం లేకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కొండాపూర్‌కు చెందిన ఆ డాక్టర్ కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. అక్టోబర్ 4వ తేదీన అతనికి టెలిగ్రామ్ యాప్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. ‘‘వివిధ ప్రోడక్టులను రివ్యవూ చేస్తే రోజుకు రూ. 3 వేల నుంచి 5 వేలకు చెల్లిస్తాం. ఈ వెబ్ లింకులో రివ్యూ పెట్టండి’’ అందులో ఉంది. డాక్టర్ నిజమేనని నమ్మి లింక్ ఓపెన్ చేసి రివ్యూ పెట్టాడు. తర్వాత ఇనిషియల్ పేమెంట్ కింది రూ. 10,900 తమకు చెల్లించాలని మోసగాళ్లు కోరారు. డాక్టర్ వాళ్లు చెప్పిన ఖాతాకు డబ్బు చెల్లించాడు. మొదటి టాస్క్ పూర్తయ్యాక అక్టోబర్ 5న అతనికి రూ. 15 వేలు వచ్చాయి. మర్నాడు మరో మరో మూడు టాస్కలు పూర్తి చేసి రూ. 20 వేలు చెల్లించగా మోసగాళ్లు రూ. 52,427 ఇచ్చారు. నమ్మకమైన వ్యాపారమేననుకున్న డాక్టర్ నెల వ్యవధిలో రూ. 19.4 లక్షలు నేరగాళ్ల ఖాతాలో డిపాజిట్ చేశారు. రివ్యూలకు సంబంధించిన అతని వర్చువల్ బ్యాంకు ఖాతాలో రూ. 27.8 లక్షలు జమైంది. అయితే విత్ డ్రా చేసుకోవడానికి వీలులేకపోయింది. టాస్క్ ఇచ్చేవాళ్లను సంప్రదించగా జవాబు రాలేదు. ఎన్నిసార్లు మెసేజ్‌లు పెట్టినా ఫలితం లేకపోవడంతో సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు 420 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Updated : 24 Nov 2023 1:11 PM GMT
Tags:    
Next Story
Share it
Top