జీహెచ్ఎంసీకి కొత్త కమిషనర్.. ఎవరంటే..?
X
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా రోనాల్డ్ రోస్ను ప్రభుత్వం నియమించింది. ఆర్థికశాఖ కార్యదర్శిగా ఉన్న రొనాల్డ్ రోస్ను జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా కొనసాగుతోన్న లోకేష్ కుమార్‌ను రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా ఈసీ నియమించింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగణంగా రాష్ట్ర సర్కార్ పలు బదిలీలను చేపట్టింది. ఎక్సైజ్ కమిషనర్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌ను జాయిట్ సీఈవోగా ఈసీ నియమించింది. సర్ఫరాజ్‌ను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. వెయిటింగ్ లో ఉన్న ముషారఫ్ అలీ ఫారుఖీని ఎక్సైజ్ శాఖ కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియపై ఈసీ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే మూడేళ్లుగా పైగా ఒకే పదవిలో ఉన్న అధికారులను బదిలీ చేయాలని ఈసీ ప్రభుత్వానికి సూచించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర సర్కార్ పలు బదిలీలను చేపట్టింది. తాజాగా చేపట్టిన ట్రాన్స్ఫర్లకు కొనసాగింపుగా మరికొన్ని బదిలీలు కూడా జరగనున్నాయి.