christmas celebration: అనాథలతో అన్నా లెజ్నేవా క్రిస్మస్ సెలబ్రేషన్స్
X
జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజ్‌నేవా... అనాథ పిల్లలతో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఆదివారం హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్‌లోని చిన్నారులతో కలిసి ముచ్చటించారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు. అంతేకాకుండా నిత్యావసర సరుకులు అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా షేర్ చేయడంతో అవి కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో అవి చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అలాగే ఆమె మనసు చాలా గొప్పదని ప్రశంసలు కురిపిస్తున్నారు.
జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సతీమణి శ్రీమతి అనా కొణిదెల గారు ప్రీ క్రిస్మస్ వేడుకలను అనాథ శరణాలయంలో ఆదివారం నిర్వహించారు. హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్ లోని చిన్నారులతో ముచ్చటించి వారి విద్యాబుద్ధుల గురించి తెలుసుకున్నారు. ఆనంతరం… pic.twitter.com/gvU4BVMneV
— JanaSena Party (@JanaSenaParty) December 24, 2023
అన్నా లెజ్‌నేవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ తన రెండో భార్య రేణు దేశాయ్‌కి విడాకులు ఇచ్చి అన్నా లెజినోవాను పెళ్లి చేసుకున్నారు. తీన్‌మార్ సినిమాతో ఆమె తెలుగుతెరకు పరిచయమైంది. ఈ క్రమంలోనే ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అయితే అన్నా లెజ్‌నేవా క్రిస్టియన్ అన్న విషయం తెలిసిందే. దీంతో ప్రతి ఏడాది ఈ పండుగను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు.