Home > హైదరాబాద్ > హైదరాబాదీలకు అలర్ట్..జులై 31 నుంచి 22 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

హైదరాబాదీలకు అలర్ట్..జులై 31 నుంచి 22 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

హైదరాబాదీలకు అలర్ట్..జులై 31 నుంచి 22 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
X

ప్రయాణికులుకు దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ సిటీలో పలు రూట్లలో ప్రయాణించే ఎంఎంటీఎస్ రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు శుక్రవారం అనౌన్స్ చేసింది. ట్రాకుల నిర్వహణ, మరమ్మతుల పనుల నిమిత్తం వారం పాటు దాదాపు 22 ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

సికింద్రాబాద్ డివిజిన్ పరిధిలో రైల్వే ట్రాకుల నిర్వహణ, మరమ్మతుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే శాఖ మొత్తం 22 రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. జులై 31 నుంచి ఆగస్టు 6వ తేదీ అంటే వారం రోజుల పాటు ఈ రైళ్లు అందుబాటులో ఉండవని తెలిపింది. రద్దు చేసిన వాటిల్లో 12 రైళ్లు లింగంపల్లి-హైదరాబాద్‌ మధ్య రాకపోకలు కొనసాగిస్తుండగా మిగతా 10 రైళ్లు ఉందానగర్‌-లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య నడుస్తున్నాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని రైల్వే అధికారులు చెబుతున్నారు.



Updated : 29 July 2023 9:04 AM IST
Tags:    
Next Story
Share it
Top