Home > హైదరాబాద్ > బస్సు ఎక్కినా, ట్రైన్ ఎక్కినా.. ఒక్కటే కామన్ మొబిలిటీ కార్డు

బస్సు ఎక్కినా, ట్రైన్ ఎక్కినా.. ఒక్కటే కామన్ మొబిలిటీ కార్డు

ఈ కార్డుకు మీరే ఓ పేరు సూచించండి

బస్సు ఎక్కినా, ట్రైన్ ఎక్కినా.. ఒక్కటే కామన్ మొబిలిటీ కార్డు
X




ఇకపై హైదరాబాద్ లో మీరు ఆర్టీసీ బస్సులో ప్రయాణించినా.. మెట్రో ట్రైన్, ఎంఎంటీఎస్, క్యాబ్, ఆటో.. ఏదీ ఎక్కినా.. టిక్కెట్ చెల్లింపుల కోసం ఒకటే కార్డు వినియోగించే అవకాశం అతి త్వరలో రానుంది. ప్రజా రవాణాలో ఒక కొత్త విధానం తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నది. ప్రత్యేక టికెట్లు తీసుకోవడానికి బదులు అన్నింటికి కలిపి ఒక్కటే కామన్ మొబిలిటీ కార్డును ప్రవేశపెట్టాలని అనుకుంటున్నది. ఇందుకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైల్, తెలంగాణ ఆర్టీసీ సంస్థలు కార్యచరణను మొదలుపెట్టాయి. తొలిగా ప్రయోగాత్మకంగా హైదరాబాద్ నగరంలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఆగస్టు రెండో వారంలో దీన్ని తీసుకురావాలని మంత్రులు నిర్ణయం చేశారు.





గురువారం సచివాలయంలో కామన్ మొబిలిటీ కార్డుపై మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌, శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్టీసీ, మెట్రో రైలు సంస్థల ఉన్నతాధికారులు కార్డుకు సంబంధించిన వివరాలను అందించారు. మొదట మెట్రో రైల్‌, ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి వీలుగా కార్డుని జారీ చేస్తామని, ఇదే కార్డుతో భవిష్యత్తులో ఎంఎంటీఎస్‌, క్యాబ్‌ సేవలు, ఆటోలను కూడా వినియోగించుకునేలా విస్తరిస్తామని మంత్రులు తెలిపారు. పౌరులు తమ ఇతర కార్డుల తరహాలో రిటైల్‌ దుకాణాల్లో కొనుగోళ్లకు కూడా వినియోగించేలా ‘వన్‌ కార్డ్‌ ఫర్‌ ఆల్‌ నీడ్స్‌’ మాదిరి ఉండాలని మంత్రులు అధికారులకు సూచించారు.





ప్రస్తుతం ప్రయోగాత్మకంగా హైదరాబాద్ వరకే ఈ కార్డు జారీ ఉంటుందని, త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడం లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశించారు. మున్ముందు దీన్ని దేశవ్యాప్తంగా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డుగా కూడా వాడుకునే వీలుందన్నారు. ఈ కామన్ మొబిలిటీ కార్డుకు ఒక మంచి పేరు సూచించాలని మంత్రులు కోరారు. ఈ మేరకు స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ ఈ కార్డుకు మంచి పేరు పెట్టాలంటూ ట్వీట్ చేశారు.


Updated : 21 July 2023 2:28 AM GMT
Tags:    
Next Story
Share it
Top