independence day 2023 : పంద్రాగస్ట్ శుభాకాంక్షలు ఇలా చెప్పుకోండి..
X
77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు యావత్ దేశం ముస్తాబవుతోంది. 200 ఏళ్లకు పైగా బ్రిటిష్ పాలకుల చేతిలో మగ్గిన భారతావని ఎంతో మంది త్యాగాలతో స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజు పంద్రాగస్ట్.. ప్రతీ పౌరుడికి ఇది అతి పెద్ద పండుగ. ఈ వేడుకలు ప్రతి సంవత్సరం గల్లీ నుంచి ఢిల్లీ దాక వైభవంగా జరుగుతాయి. కరోనా కారణంగా ఈ ఏడాది నిరాడంబరంగా జరగనున్నాయి. అయినప్పటికీ మాతృ భూమి కోసం ఎంతో మంది త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకొవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మీ స్నేహితులు, బంధువులు సన్నిహితులకు శుభాకాంక్షలు ఈ విధంగా చెప్పండి...
సామ్రాజ్యవాదుల సంకెళ్లు తెంచుకుని భరతజాతి సంపూర్ణ స్వేచ్ఛను పొందిన సందర్భంగా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
వందేమాతరం.. వందేమాతరం.. భారతీయతే మా నినాదం మిత్రులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
దేశం మనదే.. తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే. మనకెన్ని తేడాలున్నా.. దేశమంటే ఏకమౌదాం.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
భారతం ఇది నవ భారతం.. దాస్య శృంఖలాలను తెంచుకున్న ఘన భారతం.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
భిన్నత్వంలో ఏకత్వం మన గొప్పతనం.. అందుకే మన మాతృభూమి గొప్పది.. మిత్రులందరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
నేటి మన ఈ స్వాతంత్య్ర సంబరం.. ఎందరో త్యాగ వీరుల త్యాగ ఫలం.. వారందరిని స్మరించుకుంటూ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
అన్ని దేశాలకెల్ల మన దేశం మిన్న అని చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ..ఈ స్వాతంత్య్రపు పండుగను మెండుగా కన్నుల పండుగగా జరుపుకుందాం.
దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్.. దేశాన్ని ప్రేమించినట్టే మనుషులనూ ప్రేమిద్దాం, మతసామరస్యాన్ని పెంపొద్దిద్దాం హ్యాపీ ఇండిపెండెన్స్ డే