Home > జాతీయం > Independence Day 2023 > independence day 2023 : ఆగస్ట్ 15.. మనకే కాదు, ఈ దేశాలకూ పండగే...

independence day 2023 : ఆగస్ట్ 15.. మనకే కాదు, ఈ దేశాలకూ పండగే...

independence day 2023 : ఆగస్ట్ 15.. మనకే కాదు, ఈ దేశాలకూ పండగే...
X

మనిషికైనా దేశానికైనా స్వేచ్ఛ ముఖ్యం. పరాయి పాలకుల ఉక్కు పాదాల కింద నలిగిపోకుండా స్వతంత్రంగా జీవించడం, స్వేచ్ఛగా నిర్ణయాల తీసుకోవడం.. సారాంశంలో తమకు నచ్చినట్టుగా బతకడం ఒక ఆదర్శం. అందుకే ప్రతి దేశం తమ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటుంది. 250 ఏళ్లుగా మనల్ని పట్టిపీడించిన బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి లభించినందుకు గుర్తుగా ఆగస్టు 15ను స్వాతంత్య్ర వేడుకలు చేస్తుంటాం. అదే రోజు మన దేశంలోనే కాకుండా మరికొన్ని దేశాలు కూడా అదే రోజు స్వాతంత్య్రం పొందాయి. ఇంతకీ ఆ దేశాలు ఏమిటి? వాటి వెనక ఉన్న చరిత్ర ఏంటో తెలుసుకుందాం.





భారత్ : బ్రిటిష్ నిరంకుశ పాలన నుంచి భారత్ భానిస సంకెళ్లను తెంచుకున్న రోజు 1947 ఆగష్టు 15. అదే రోజు అర్ధరాత్రి 12 గంటలకు మనకు స్వేచ్ఛ లభించింది. ఎంతో మంది త్యాగాలకు ప్రతీకగా ప్రతి ఏటా అదే రోజు మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వేడుకలు చేసుకుంటూ వాళ్లను స్మరించుకుంటాం. మన దేశానికి వచ్చిన బ్రిటన్ పాలకుల దోపిడీతో ఎన్నో సహజ వనరులు, చారిత్రక సంపద కోల్పోయాం. అప్పట్లో అఖండ భారత్‌గా ఉన్న ప్రాంతం పాకిస్తాన్, భారత్‌గా రెండు ముక్కలు అయింది. ఆగస్టు 14న పాకిస్తాన్‌లో స్వాతంత్య్ర దినోత్సవం కాగా.. మన దేశంలో ఆగస్టు 15న నిర్వహిస్తాం. పాక్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించింది.





దక్షిణ కొరియా : దక్షిణ కొరియా కూడా 1945 ఆగస్టు 15న స్వాతంత్య్రం పొందింది. జపాన్ నుంచి విముక్తి పొంది రెండు వేర్వేరు ప్రాంతాలుగా మారింది. ఒకటి దక్షిణ కొరియా, రెండు ఉత్తర కొరియాగా మారాయి. ఈ రెండు దేశాలు కూడా అదే రోజున వేడుకలు జరపుకుంటున్నాయి. జపాన్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో సంవత్సరాలపాటు పోరాటం సాగింది. అమెరికా, సోవియట్ యూనియన్ సాయంతో కొరియన్ దేశాలు జపాన్‌పై విజయం సాధించాయి. ఇక్కడ ఆగష్టు 15 ను గ్వాంగ్బోక్జియోల్ అని పిలుస్తారు. ఆనాటి పోరాటంలో చనిపోయిన వారికి గుర్తుగా సియోల్‌లోని పగోడా పార్క్ వద్ద వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ.





ఉత్తర కొరియా : 1910లో మొత్తం కొరియాను జపాన్ విలీనం చేసుకుంది. ఆ తర్వాత 1945లో రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోవడంతో దిగి వచ్చింది. కొరియాపై తమ ఆధిపత్యాన్ని వదులుకుంది. 1945 ఆగస్టు 15న కొరియాకు స్వేచ్ఛ లభించింది. ఆ తర్వాత 1948లో రెండు ముక్కలైంది. ఉత్తర కొరియా, దక్షిణ కొరియాగా విడిపోయి ప్రత్యేక ప్రభుత్వాలు ఏర్పాటు చేయబడ్డాయి. అయితే ఈ రెండు దేశాలు సంయుక్తంగా ఒకే రోజు జాతీయ సెలవు దినం పాటించేంది కేవలం ఆగస్టు 15 కావడం విశేషం. ఉత్తర కొరియా జాతీయ పతాకం ఎరుపు, సన్నటి దార లాంటి తెలుపు, నీలం రంగు మూడు వర్ణాలు ఉంటాయి. ఈ పతకాంలో ఓ నక్షత్రపు గుర్తును గమనించవచ్చు. ఈ వేడుకలను ప్యోంగ్యాంగ్‌లో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.





లిక్టెన్‌స్టీయిన్: యూరప్‌లోని అతిచిన్న దేశం ఇది. స్విట్జర్లాండ్, ఆస్ట్రియాలు సరిహద్దు దేశాలు. జర్మనీ వలస పాలన కింద నలిగిపోయిన ఈ బుద్ది దేశానికి 1866 ఆగస్ట్ 15న స్వాంతంత్ర్యం వచ్చింది. అయితే 1940 వరకు గాని దీన్ని స్వాంత్ర్య దినోత్సవాన్ని అధికారికంగా జరపులోలేదు. 1940 నుంచి నేషనల్ డీగా పంద్రాగస్ట్ వేడుక జరుపుకుంటోంది.





బహ్రెయిన్ : పర్షియన్ సింధుశాఖలోని ఈ చిన్నదేశానికి కూడా పంద్రాగస్ట్ నాడే పరాయి పాలన నుంచి విముక్తి లభించింది. 1971లో బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం తెచ్చుకుంది. చిన్నదేశమే అయినా చమురు నిల్వల కారణంగా ఆర్థిక స్వావలంబన సాధించింది.

కాంగో రిపబ్లిక్ : మధ్య ఆఫ్రికాలోని కాంగో రిపబ్లిక్ ఆగస్ట్ 15వ తేదీనే దాంస్య శృంఖాలు తెంచుకుంది. కాంగో బ్రజావిలేగానూ పేరొందిన ఈ దేశం 1960లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్ర్యం పొందింది.





Updated : 12 Aug 2023 2:35 PM GMT
Tags:    
Next Story
Share it
Top