independence day 2023 : తెలంగాణ రైతాంగానికి సర్కార్ గుడ్ న్యూస్
X
పంద్రాగస్టు సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తున్నట్లు తాజా ప్రకటించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను తాజాగా సర్కార్ జారీ చేసింది. దీంతో తెలంగాణ రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రైతాంగానికి తెలంగాణ రాష్ట్ర సర్కార్ శుభవార్త చెప్పింది. అన్నదాతలకు రూ.లక్ష లోపు (రూ.99,999) వరకు రుణమాఫీని పూర్తి చేసింది. సోమవారం ఒక్కరోజే 9క్షలకుపైగా రైతులకు ఏకంగా రూ.5,809 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రైతుల అకౌంట్లలో ఆర్థిక శాఖ సొమ్మును జమ చేసింది. తాజా రుణమాఫీతో కలుపుకుని ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 16.66 లక్షల మంది రైతులకు సర్కార్ రుణమాఫీ పూర్తి చేసింది. కేవలం రుణమాఫీలకే ప్రభుత్వం రూ.7,753 కోట్లను ఖర్చు చేసింది.