వందేమాతరమ్ ప్రపంచ రికార్డ్.. లక్షల గొంతులు ఒక్కటై..
X
ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 2 లక్షల మంది ఒకేసారి జాతీయ గేయం ‘వందేమాతమ్’ పాడారు. భరతమాతను ‘సులజాం సుఫలాం సస్యశామలాం మాతరం’’ అంటూ ఉప్పొంగే దేశభక్తితో కీర్తించారు. ఒకే చోట పదివేల మంది సహా ఆన్ లైన్ మాధ్యమాల్లో కలిపి మొత్తం 2 లక్షల మందితో ఈ ప్రపంచ రికార్డు సృష్టించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్పుర్ సైన్స్ కాలేజ్ ఆవరణలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. ఓం మండలి శివశక్తి అవతార్, సేవా సంస్థాన్ వసుదైక కుటుంబం ఫౌండేషన్ సంస్థలు ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, సామాన్య ప్రజలు, పలు పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మువ్వన్నె పతకాలు చేబూని లయబద్ధంగా పాడారు. కొందరు తిరంగా చీరలు ధరించారు. గేయాలాపనకు ముందుకు కలశాలతో ఊరేగింపు కూడా తీశారు. ఆరు రాష్ట్రాల నుంచి ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంద్రాగస్టు నేపథ్యంలో దేశభక్తిని చాటిచెప్పడానికి ఈ కార్యక్రమం నిర్వహించారు.