Home > అంతర్జాతీయం > భారతీయ అమెరికన్లకు శుభవార్త

భారతీయ అమెరికన్లకు శుభవార్త

భారతీయ అమెరికన్లకు శుభవార్త
X

గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న అమెరికన్ భారతీయులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 1992 నుంచి నిరుపయోగంగా ఉన్న గ్రీన్ కార్డులను మళ్ళీ వినియోగించుకునేలా చేయాలన్న సిఫారుసుపై ఆమోద్ర ముద్ర వేసింది. దీంతో గ్రీన్ కార్డ్ కోసం చూస్తున్న చాలా మందికి త్వరలోనే అవి లభించనున్నాయి.

అమెరికాలో శాశ్వతనివాసానికి ఆమోదం తెలుపుతూ ఇచ్చే పత్రం గ్రీన్ కార్డ్. అమెరికా ప్రతీ ఏడాది 1.40 లక్షల గ్రీన్ కార్డులను జారీ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా లభించిన ఆమోదం ప్రకారం అదనంగా 2.30 లక్షల కార్డుల్లో మరికొన్నింటిని విడుదల చేస్తారని బైడెన్ కు ఆసియన్ అమెరికన్ల సలహా మండలిలో సభ్యుడు భుటోరియా చెప్పారు. ఉపయోగంలో లేని గ్రీన్ కార్డులను తిరిగి స్వాధీనం చేసుకోవడం, భవిష్యత్తులో గ్రీన్ కార్డుల వృధా అరికట్టేందుకు సిఫారుసులు చేశామని చెప్పారు. ఇవి కనుక అమలు అయితే గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న చాలా మందికి ఊరట లభిస్తుందని ఆయన తెలిపారు.

చాలా ఏళ్ళుగా లక్షలుగా గ్రీన్ కార్డులు పేరుకుపోయాయి. అవన్నీ నిరుపయోగంగా ఉండిపోతున్నాయి. ప్రతీఏడాది ఇచ్చే 1.40 లక్షల గ్రీన్ కార్డులతో పాటూ స్వాధీనం చేసుకున్న 2.30 లక్షల కార్డుల్లో కొన్నింటిని జారీ చేయాలి. ఒకవేళ ఏదైనా ఆర్ధిక సంవత్సరంలో సంబంధిత పత్రాలను ఏజెన్సీలు ప్రాసెస్ చేయలేకపోతే...అన్ని గ్రీన్ కార్డుల వార్షిక పరిమితి ప్రకారం అర్హులైన వలసదారులకు అందుబాటులో ఉండేలా కొత్త విధానాన్ని తీసుకురావాలి. కొత్త విధానం అమల్లోకి రాకముందే ఉపయోగించని గ్రీన్ కార్డ్ లను తిరిగి పొందేందుకు ఈ విధానాన్ని ముందుగానే వర్తింపజేస్తామని భుటోరియా వివరించారు.

తాము చేసిన సిఫారుసులు అమల్లోకి వస్తే ఎన్నో కుటుంబాలు, వ్యక్తులతో పాటూ అమెరికా ఆర్ధిక వ్యవస్థ కూడా బావుంటుందని చెబుతున్నారు. 2020 లెక్కల ప్రకారం 42 లక్షల కుటుంబాలు గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఐటీ నిపుణులు కనీసం పదేళ్ళు అయినా గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి.


Updated : 8 July 2023 10:45 AM IST
Tags:    
Next Story
Share it
Top