Home > అంతర్జాతీయం > Donald Trump: ట్రంప్‌‌కు షాక్.. అనర్హుడిగా ప్రకటించిన మరో రాష్ట్రం

Donald Trump: ట్రంప్‌‌కు షాక్.. అనర్హుడిగా ప్రకటించిన మరో రాష్ట్రం

Donald Trump: ట్రంప్‌‌కు షాక్..  అనర్హుడిగా ప్రకటించిన మరో రాష్ట్రం
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు బరిలోకి దిగిన రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే దేశాధ్యక్షుడి పదవికి ఆయన అనర్హుడంటూ ఇటీవల కొలరాడో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. జనవరి 6, 2021న రాజధాని వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనంపై దాడి ఘటనలో ట్రంప్ పాత్ర ఉండడంతో ఆయనపై అనర్హత వేటు వేసింది కొలరాడో రాష్ట్రం. తాజాగా మరో రాష్ట్రం కూడా ఆయన మీద వేటు వేసింది. 2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ట్రంప్ ను అనర్హుడిగా ప్రకటిస్తూ మైనే రాష్ట్ర ఉన్నత ఎన్నికల అధికారి నిర్ణయం తీసుకున్నారు. కొలరాడో తీర్పుపై రిపబ్లికన్‌ పార్టీ అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించిన వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

మైనే అధికారుల తరహాలో మరికొన్ని రాష్ట్రాలు కూడా కొలరాడో తీర్పును పాటిస్తే మాత్రం ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల పోటీలకు అనర్హుడవుతారు. అయితే కొలరాడో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పబ్లికన్‌ పార్టీ సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసింది. అమెరికా సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై ట్రంప్‌ భవితవ్యం ఆధారపడి ఉంది. కాగా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి పేరును ఓ ఎన్నికల అధికారి ఇలా బ్యాలెట్‌ నుంచి తొలగించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి.

తనపై అనర్హత వేటు వేస్తూ కొలరాడో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీవ్రంగా స్పందించారు. ఇదంతా అధ్యక్షుడు జో బైడెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుట్రేనని విమర్శించారు. ‘‘ఎన్నికల్లో పోటీ చేయకుండా నన్ను నిలువరించేందుకు జో బైడెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆయన సమూహం చేస్తున్న విపరీత చర్యలివి. అధ్యక్ష ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు వారు అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. జో బైడెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రజాస్వామ్యానికి ముప్పు. ఓడిపోతారనే ఇలా చట్టసంస్థలను ఆయుధాలుగా చేసుకుని ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారు’’ అని ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండిపడ్డారు.

Updated : 29 Dec 2023 5:49 AM GMT
Tags:    
Next Story
Share it
Top