66 ఏళ్ల వృద్దుడితో 23 ఏళ్ల కుర్రాడు ప్రేమ పెళ్లి
X
ప్రేమ, ఎప్పుడు, ఎలా పుడుతుంది అనేది ఎవరికీ తెలియదు. ప్రేమకు కుల, మత, పేద, ధనిక అనే బేదం ఉండదు. ప్రేమకు వయసుతో పాటు లింగబేధం కూడా లేదని కొన్ని ఘటనలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో చోట వింత సంబంధాలు వెలుగు చూస్తూనే ఉంటాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన కొత్త రకం లవ్ స్టోరీ హాట్ టాపిక్ గా మారింది. 23 ఏళ్ల ఓ యువకుడు.. ఏకంగా 66 ఏళ్ల వృద్ధుడిని ప్రేమించాడు. అంతటితో ఆగకుండా పెళ్లి కూడా చేసుకున్నాడు. 6 ఏళ్ల క్రితమే వీరు ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఈ వింత జంట సహజీవనం చేస్తోంది.
గ్రైండర్ అనే డేటింగ్ యాప్ ద్వారా 23 ఏళ్ల అరోన్..66ఏళ్ల మైఖేల్‌ను కలిశాడు.మైఖేల్ అంటే అరోన్‌కు పిచ్చి ప్రేమ. ఐర్లాండ్ లోని డబ్లిన్ లో ఉన్న అతడి కోసం న్యూయార్క్ నుంచి విమానంలో వెళ్లేవాడు. లాక్‌డౌన్ సమయంలో ఇద్దరూ భార్యాభర్తల మాదిరిగానే ఒకే గదిలో ఉన్నారు. లాక్డౌన్ ముగిసిన వెంటనే వారిద్దరూ వివాహం చేసుకున్నట్లు అరోన్ తెలిపాడు. ఎవరు ఏమనుకున్న మైఖేల్ తనకు అద్భుత భాగస్వామి అని చెబుతున్నాడు. తమ సంబంధంలో కూడా చాలా ఒడిదుడుకులు ఎదురయ్యాయని వివరించాడు.