Home > అంతర్జాతీయం > అమెరికాలో పిడుగుల వర్షం

అమెరికాలో పిడుగుల వర్షం

అమెరికాలో పిడుగుల వర్షం
X

అమెరికాలో పిడుగులతో కూడిన వర్షాలు అలజడి సృష్టిస్తున్నాయి. దీనివల్ల అక్కడ చాలా విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. మరికొన్ని వఫ్లైట్ లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

అమెరికాలోని ఈశాన్య ప్రాంతంలో వర్షాలు దారుణంగా కురుస్తున్నాయి. దానికి తోడు పిడుగులు పడుతున్నాయి. పరిస్థితి ఏమీ బాగాలేదని చెబుతోంది అక్కడి ఫెడరల్ అడ్మినిస్ట్రేషన్. జన జీవనానికి ఏమీ ఇబ్బంది కలగకపోయినా...విమానాలు తిరగడానికి మాత్రం అనుకూలంగా లేదని అంటోంది. దీంతో ఈశాన్య ప్రాంతంలో 1,320 ఫ్లైట్ సర్వీసులు రద్దు అయ్యాయి. న్యూజెర్సీ, న్యూయార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కూడా విమానాలు వెళ్ళడం లేదు. మొత్తంగా అనని ప్రాంతాల నుంచి 2, 600 విమానాల సర్వీసులు రద్దు చేశారు. మరో 8వేల ఫ్లైట్ లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు ఎయిర్ పోర్ట్ కు రావడానికి ముందే ఫ్లైట్ స్టేటస్ ను చెక్ చేసుకుని రావాలని ఎయిర్ పోర్ట్ అథారిటీలు సూచిస్తున్నాయి.

మరోవైపు న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, పెన్సిల్వేనియా, మాసాచుసెట్స్, వెర్మాంట్ ప్రాంతాల్లో వరద హెచ్చరికలను కూడా జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని చెబుతున్నారు. దాంతో పాటూ కొన్నిచోట్ల టోర్సడోలు వచ్చే అవకాశం కూడా ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఈశాన్యం ఇలా ఉంటే అమెరికా దక్షిణం వైపు మాత్రం ఎండలు దంచికొడుతున్నాయి. కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ దాకా రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటూ 10 లేదా 20 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అక్కడి జాతీయ వాతావరణ సంస్థ తెలిపింది. ఆరిజోనా వంటి రాష్ట్రాల్లో అయితే రాత్రే అవడం లేదు.

Updated : 17 July 2023 9:24 AM GMT
Tags:    
Next Story
Share it
Top